తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Temple Ghat Road: రెండు నెలల్లో దుర్గగుడి ఘాట్ రోడ్డుకు మరమ్మతులు - సిఎస్

Temple Ghat Road: రెండు నెలల్లో దుర్గగుడి ఘాట్ రోడ్డుకు మరమ్మతులు - సిఎస్

Sarath chandra.B HT Telugu

16 November 2023, 13:35 IST

    • Temple Ghat Road: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డులో తరచూ కొండ చరియలు విరిగిపడుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండునెలల్లో ఘాట్‌ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని సిఎస్ అధికారుల్ని ఆదేశించారు. 
దుర్గగుడి ఘాట్ రోడ్డు పనుల్ని పరిశీలిస్తున్న సిఎస్ జవహార్ రెడ్డి
దుర్గగుడి ఘాట్ రోడ్డు పనుల్ని పరిశీలిస్తున్న సిఎస్ జవహార్ రెడ్డి

దుర్గగుడి ఘాట్ రోడ్డు పనుల్ని పరిశీలిస్తున్న సిఎస్ జవహార్ రెడ్డి

Temple Ghat Road: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం ఘాట్ రోడ్డు పటిష్టత పనులను రెండు మాసాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఇంద్రకీలాద్రిపై గల శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పటిష్టత పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్ రోడ్డు పనులను వేగవంతం చేసి టెండర్ల ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించారు.చిన్న ఘాట్ రోడ్డే అయినందున త్వరిత గతిన పటిష్టమైన రాక్ మిటిగేషన్ పనులు చేపట్టాలని అన్నారు. గతంలో తిరుమల కొండ ఘాట్ రోడ్డుపై కొండచర్యలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాళ్ళు దిగువ రెండు మూడు వరసల్లో ఘాట్ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నదని గుర్తు చేశారు.

అటువంటి ప్రమాదాలను ముందుగానే తెలుసుకుని అప్రమత్తమై ట్రాఫిక్ ను నియంత్రించేందుకు కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నచోట్ల సెన్సార్లను ఏర్పాటు చేయగా వాటి ద్వారా అలాంటి ప్రమాదాలను రెండు మూడు గంటల ముందుగానే తెలుసుకుని ట్రాఫిక్ ను నియంత్రించి ఆప్రమాదాలను అధిగమించినట్లు సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఇంద్రకీలాద్రిపై కూడా అలాంటి అవసరం ఉంటుందేమో పరిశీలించాలని సిఎస్ అధికారులకు సూచించారు.

ఇంద్రకీలాద్రిపై మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా చేపడుతున్నఎలివేటెడ్ క్యూ కాంప్లెక్సు నిర్మాణం,మల్టీలెవెల్ వాహనాల పార్కింగ్ విధానం,శివాలయం పునరుద్ధరణ, ప్రసాదం పోటు నిర్మాణ పనులు మొదలైన పనుల వివరాలను సిఎస్ జవహర్ రెడ్డి దేవాదాయశాఖ అధికారులను అడిగి తెల్సుకున్నారు.

ఈసమావేశంలో దేవాదాయశాఖ కమీషనర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ సుమారు 2కోట్ల రూ.ల అంచనా వ్యయంతో 180 మీటర్ల పొడవున ఈఘాట్ రోడ్డును పట్టిష్టం చేయనున్నట్టు వివరించారు. అదే విధంగా దేవాలయంలో చేపడుతున్నఇతర అభివృద్ధి పనులను సిఎస్ కు వివరించారు.ఎన్టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు,విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఘాట్ రోడ్డు పటిష్టతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు.

తదుపరి వ్యాసం