తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Appsc Jobs: గ్రూప్‌ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకు సిఎం జగన్ గ్రీన్ సిగ్నల్

APPSC Jobs: గ్రూప్‌ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లకు సిఎం జగన్ గ్రీన్ సిగ్నల్

HT Telugu Desk HT Telugu

25 May 2023, 15:19 IST

    • APPSC Jobs: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతించారు. ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్‌1, గ్రూప్‌2లలో ఉద్యోగాల భర్తీ చేయడానికి  సిఎం జగన్.. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను అనుమతించారు. 
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి

APPSC Jobs: గ్రూప్‌-1, 2 ఉద్యోగార్ధులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వెయ్యి పోస్టుల్ని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి అమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ కమిషన్ సభ్యులతో గురువారం సమావేశమైన ఖాళీల భర్తీపై చర్చించారు.

ట్రెండింగ్ వార్తలు

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

AP TS Local Issue: ఈ ఏడాది వరకు తెలంగాణ విద్యాసంస్థల్లో నాన్ లోకల్ కోటా కొనసాగించాలని ఏపీ సర్కారు విజ్ఞప్తి

AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఖాళీల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లను జారీ చేసేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. అతి త్వరలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

గురువారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలపై అధికారులు ముఖ్యమంత్రితో చర్చించారు. పోస్టుల భర్తీకి అవసరమైన వివరాలు సిఎంకు అందించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని వెల్లడించారు.

ఏపీలో గ్రూప్‌1, గ్రూప్‌2 నోటిఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని వివరించారు. గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు ఖాళీ ఉండగా, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ద్వారా మొత్తంగా 1000కిపైగా పోస్టులు భర్తీ చేయనున్నామని తెలిపారు.

గ్రూప్‌1, గ్రూప్‌ 2 పరీక్షలకు సంబంధించి వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపైనా దృష్టిసారించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

తదుపరి వ్యాసం