తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Petition : చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్‌.. హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు

CBN Petition : చంద్రబాబు కుడి కంటికి ఆపరేషన్‌.. హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు

26 October 2023, 17:02 IST

    • Chandrababu Petition:చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
చంద్రబాబు పిటిషన్
చంద్రబాబు పిటిషన్

చంద్రబాబు పిటిషన్

Chandrababu Petition: స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. 48 రోజులు గడుస్తున్నప్పటికీ… బెయిల్ రాలేదు. అయితే చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ ఆయన తరపు న్యాయవాదులు… హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

ట్రెండింగ్ వార్తలు

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

అనారోగ్యం పేరుతో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ను వెంటనే విచారించాలంటూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఇప్పటికే స్కిల్‌ స్కామ్‌లో వెకేషన్‌ బెంచ్‌ ముందు చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. శుక్రవారం రెగ్యూలర్‌ బెయిల్‌ పిటిషన్‌ను విచారించనుంది వెకేషన్‌ బెంచ్‌. ఈలోపే అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు మరో పిటిషన్‌ దాఖలు చేశారు. చంద్రబాబుకు స్కిన్‌ ఎలర్జీ ఉందని, ఆయన వ్యక్తిగత వైద్యులతో చికిత్స చేయించాల్సిన అవసరం ఉందని పిటిషన్‌ లో వివరించారు. చంద్రబాబుకు కంటి సమస్యలున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఎడమ కంటికి క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌ జరిగిందని, మరో కంటికి వెంటనే ఆపరేషన్‌ చేయాలని ప్రస్తావించారు. దీంతో పాటు చంద్రబాబుకు ఇతర అనారోగ్య సమస్యలున్నాయని వివరించారు.

రేపటికి విచారణ వాయిదా…

చంద్రబాబు అరెస్టు సమయంలో విధుల్లో ఉన్న సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డు కావాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కూడా కౌంటరు దాఖలు చేశారు. తదుపరి విచారణను న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది.

తదుపరి వ్యాసం