తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Woman Lost Hair: క్యూలైన్లో మహిళ జడ కత్తిరించేశారు, దుర్గగుడిపై దారుణం..

Woman lost Hair: క్యూలైన్లో మహిళ జడ కత్తిరించేశారు, దుర్గగుడిపై దారుణం..

Sarath chandra.B HT Telugu

27 November 2023, 9:40 IST

    • Woman lost Hair: కాస్త ఏమరపాటుగా ఉంటే విలువైన వస్తువులు మాయం చేయడం ఎక్కడైనా  జరిగేదే.. బెజవాడలో ఏకంగా అమ్మవారి దర్శనం కోసం క్యూలో నిలబడిన భక్తురాలి జడను కత్తిరించుకుపోయారు. 
క్యూలైన్లో భక్తు రాలి జడ కత్తిరించిన అగంతకుడు
క్యూలైన్లో భక్తు రాలి జడ కత్తిరించిన అగంతకుడు

క్యూలైన్లో భక్తు రాలి జడ కత్తిరించిన అగంతకుడు

Woman lost Hair: బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరిగిన దొంగతనం అందరిని షాక్‌కు గురి చేసింది. ఇంతకాలం భక్తుల జేబులో పర్సులు, మెడలో గొలుసులు, ఖరీదైన చెప్పులు మాయం కావడం సాధారణం అయిపోయినా ఇప్పుడు ఏకంగా పొడవాటి జడను మాయం చేయడం ఆందోళనకు గురి చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోడానికి వచ్చిన కుటుంబానికి ఆదివారం చేదు అనుభవం ఎదురైంది. ఓ భక్తురాలి జడను గుర్తు తెలియని వ్యక్తి కత్తిరించుకుని పోయాడు. ఈ ఘటన ఆదివారం జరిగింది.

రాజమండ్రికి చెందిన ఓ కుటుంబం అమ్మవారి దర్శనానికి వచ్చింది. మధ్యాహ్నం మహా నివేదన నిమిత్తం అమ్మవారి దర్శనం నిలి పివేశారు. ఆ సమయంలో బాధితురాలి కుటుంబం మహా మండపం దిగువన క్యూలైన్లలో వేచి ఉన్నారు. మహానివేదన తర్వాత లిఫ్టు ద్వారా కొండపైకి చేరుకున్నారు.

కొండపైకి చేరిన తర్వాత మహిళ తన పొడ వాటి జడను సరిచేసుకుంటుండగా జడ కత్తిరించేసి ఉండటం గమనించి ఖంగుతిన్నారు. దాదాపు 15 అంగుళాల జడను కత్తిరించి పట్టుకుపోయారు. వెంటనే బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీ లించడంతో సుమారు 30 సంవత్సరాలుండే వ్యక్తి క్యూలైన్లో వెనుక నిలబడి మూడు నిమిషాల వ్యవధిలో మహిళ జడ కత్తిరించి జేబులో పెట్టుకుని అక్కడి నుంచి ఉడాయించినట్లు గుర్తించారు. పాత నేరస్తుడు జుట్టును అమ్ముకోడానికి జడ కత్తిరించి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఇంద్రకీలాద్రిపై భద్రతా లోపానికి అద్దం పడుతోంది. క్యూలైన్లోనే భక్తురాలిని జడను కత్తిరించడం చర్చనీయాంశంగా మారింది.

తదుపరి వ్యాసం