తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Universities Jobs : ఏపీ యూనివర్సిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్!

AP Universities Jobs : ఏపీ యూనివర్సిటీల్లో 3,282 టీచింగ్ పోస్టులు, మూడ్రోజుల్లో నోటిఫికేషన్!

17 October 2023, 20:10 IST

    • AP Universities Jobs : ఏపీలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 20న 3,282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ తెలిపారు.
ఏపీలో ఉద్యోగాలు
ఏపీలో ఉద్యోగాలు

ఏపీలో ఉద్యోగాలు

AP Universities Jobs : ఏపీలోని యూనివర్సిటీల్లోని 3,282 అధ్యాపక పోస్టుల భర్తీకి ఈ నెల 20న నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. డిప్యుటేషన్‌పై మరో 70 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్‌ సహా అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా భారీగా ఖాళీలు భర్తీ చేయలేదన్నారు. యూనివర్సిటీలను పటిష్టం చేసేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. అయితే విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో భాగంగా ప్రస్తుతం పనిచేస్తున్న అడ్‌హాక్‌ అధ్యాపకులకు 10 శాతం వెయిటేజీ మార్కులు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని హేమచంద్రారెడ్డి వెల్లడించారు. యూనివర్సిటీల్లో సుమారు 2,600 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తు్న్నారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Update: మండు వేసవిలో మారిన వాతావరణం, బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Gopi Thotakura: అంతరిక్ష పర్యాటకుడిగా ప్రవాసాంధ్రుడు.. భూ కక్ష్య వెలుపలికి విజయవాడ యువకుడి ప్రయాణం

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

South West Monsoon : అండమాన్ ను తాకిన నైరుతి రుతుపవనాలు, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రాత పరీక్ష ద్వారా ఎంపిక

అడ్ హాక్ అధ్యాపకులకు సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఇచ్చే 10 శాతం వెయిటేజీ మార్కులను ఏడాదికి ఒకటి చొప్పున లెక్కిస్తారని హేమచంద్రారెడ్డి తెలిపార. ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ద్వారా ఒక్కో పోస్టుకు 12 మందిని ఎంపిక చేస్తామన్నారు. వీరిలో అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా ఒక్కో పోస్టుకు తిరిగి నలుగురిని ఎంపిక చేస్తామని వెల్లడించారు. దీంతో పాటు యూనివర్సిటీల్లో బోధనేతర సిబ్బంది భర్తీకి కసరస్తు జరుగుతోందన్నారు.

10 మార్కుల వెయిటేజీ

రాష్ట్రంలోని వర్సిటీల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 2600 పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 1000 మంది సెల్ఫ్ ఫైనాన్స్ (విద్యార్ధులు చెల్లినే ట్యూషన్ ఫీజు నుంచి జీతాలు) కింద పనిచేస్తున్నారు. ప్రస్తుతం చేపట్టే ఖాళీల భర్తీలోకి వీరు రారాని, వీరి విధులకు ఎలాంటి ఆటంకం ఉండదన్నారు. కాంట్రాక్ట్‌ పద్దతిలో పనిచేస్తున్న వారికి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు వెయిటేజీ ఉంటున్నారు. మిగిలిన వారు ఇతరులతో పాటు అప్లై చేసుకోవాలని సూచించారు.

  • నోటిఫికేషన్ విడుదల తేదీ- 20 అక్టోబర్ 2023
  • పరీక్ష నిర్వహణ తేదీ- నవంబర్ లేదా డిసెంబర్
  • పరీక్షా ఫలితాలు- జనవరి, 2024

తదుపరి వ్యాసం