తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Hc Recruitment 2024 : సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

AP HC Recruitment 2024 : సివిల్‌ జడ్జి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - ముఖ్య తేదీలివే

14 January 2024, 8:03 IST

    • AP High Court Recruitment 2024 : ఏపీలో సివిల్ జడ్జి పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 39 ఖాళీలు ఉండగా… అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

AP High Court Recruitment 2024 : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర జ్యుడీషియల్‌ సర్వీసెస్‌లో భాగంగా 39 సివిల్‌ జడ్జి పోస్టుల(జూనియర్‌ డివిజన్‌)ను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య వివరాలు చూస్తే…..

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

AP Govt Jobs 2024 : ఏపీ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల - ఖాళీలు, ముఖ్య తేదీలివే

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - ఏపీ హైకోర్టు (ఏపీ స్టేట్‌ జ్యుడీషియల్‌ సర్వీసు).

ఉద్యోగాలు - సివిల్‌ జడ్జి (జూనియర్‌ డివిజన్‌)

మొత్తం ఖాళీలు - 39 పోస్టులు( ఇందులో 32 ఖాళీలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. మరో 7 ఖాళీలు ట్రాన్స్‌ఫర్‌ ద్వారా అవుతాయి)

అర్హత -లా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి - 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు అయిదేళ్లు; దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు -ఆన్ లైన్ విధానంలో చేయాలి.

అప్లికేషన్ ఫీజు - రూ.1500 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులు రూ.750 చెల్లించాలి.

దరఖాస్తులు ప్రారంభం - 31 జనవరి 2024.

దరఖాస్తులకు తుది గడువు 01 మార్చి 2024.

స్క్రీనింగ్ టెస్ట్ హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ - 15 మార్చి 2024.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)- 13 ఏప్రిల్ 2024.

ప్రాథమిక కీ విడుదల/ అభ్యంతరాల స్వీకరణ: 18 ఏప్రిల్ 2024.

ఎంపిక ప్రక్రియ - స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది జాబితా ఉంటుంది.

ఎగ్జామ్ టైం - 2 గంటలు

స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష కేంద్రాలు - గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖ.

వెబ్ సైట్ - https://aphc.gov.in/index.html

పూర్తి స్థాయి నోటిఫికేషన్ తో పాటు ఖాళీల రిజర్వేషన్లు, సిలబస్ వివరాలను ఇక్కడ చూడొచ్చు…..

మంగళగిరి ఎయిమ్స్ లో టీచింగ్ పోస్టులు

AIIMS Mangalagiri Jobs : మంగళగిరి ఎయిమ్స్(AIIMS)లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎయిమ్స్ లో మెడికల్ సూపరింటెండెంట్, రిజిస్ట్రార్, నర్సింగ్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.2,18,200 జీతాభత్యాలు ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 4వ తేదీలోపు మంగళగిరి ఎయిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.

మొత్తం ఖాళీలు

ప్రొఫెసర్- 20 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్- 73 పోస్టులు

అడిషనల్‌ ప్రొఫెసర్- 10 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్- 22 పోస్టులు

తదుపరి వ్యాసం