తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  High Court On Rushikonda : రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court On Rushikonda : రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక ఆదేశాలు

HT Telugu Desk HT Telugu

03 November 2022, 15:24 IST

    • Visakhapatnam Rushikonda : విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారులను ఆదేశించింది.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు (aphc)

ఏపీ హైకోర్టు

విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తవ్వకాలపై సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు చేశారో తెలపాలని చెప్పింది. అనుమతికి మించి ఎంతమేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని పేర్కొంది. ఆ తర్వాత సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కి వాయిదే వేసింది కోర్టు.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

అయితే కొన్ని రోజులుగా రుషికొండ తవ్వకాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. నిబంధనలను అతిక్రమించినట్టుగా హైకోర్టులో ప్రభుత్వం అంగీకరించినట్టుగా తెలుస్తోంది. మూడు ఎకరాల మేర అదనంగా తవ్వకాలు జరిపామని చెప్పింది. పిటిషనర్లు మాత్రం మూడు కాదని ఇరవై ఎకరాల మేర అదనంగా తవ్వారని తెలిపారు. హైకోర్టు సర్వే చేయాలని తెలిపింది. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

గత విచారణలోనూ ప్రభుత్వానికి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రుషికొండ(Rushikonda) తవ్వకాలపై ఘాటుగా స్పందించింది. అభివృద్ది కోసం పాదయాత్ర చేస్తుంటే ఆ ప్రాంతానికి రానివ్వమంటున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వం(Govt)లో విభిన్న వైఖరులేంటి? అని ప్రశ్నించింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. కేంద్ర అటవీశాఖ(Forest Department) ఆధ్వర్యంలో తనిఖీ చేయాలని పంపుతామని స్పష్టం చేసింది. కమిటీ వేస్తే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వానికి ప్రశ్నలు వేసింది.

9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. గూగుల్ మ్యాప్‌(Google Map)లను అందించారు. 9.88 ఎకరాలకే తవ్వకాలు, నిర్మాణాలు చేపట్టామని ప్రభుత్వ న్యాయవాది నిరంజన్‌రెడ్డి చెప్పారు. గూగుల్ మ్యాప్‌లు అబద్ధాలు చెబుతాయా అని హైకోర్టు(High Court) అడిగింది. అఫిడవిట్ దాఖలుకు సమయం కోరింది ప్రభుత్వం. ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టు ఉందని సందేహం వ్యక్తంచేసిన హైకోర్టు.. అఫిడవిట్ వేసిన తర్వాత వాస్తవాలు తేలుస్తామని చెప్పింది. కేసు విచారణ నవంబర్ 3 కు వాయిదా వేసింది. తాజాగా ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు ఎకరాలు అదనంగా తవ్వమని అంగీకరించింది. కానీ అంతకమించి తవ్వాని పిటిషనర్లు చెప్పారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ సర్వే చేస్తే.. నిజం బయటకు వస్తుందని అభిప్రాయాలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం