తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Water For Godavari Delta : గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు - జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు

Water For Godavari Delta : గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు - జిల్లా కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశాలు

09 November 2023, 15:00 IST

    • Water for Rabi in Godavari Delta: గోదావరి డెల్టాకు రబీకి సాగునీరిచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సీఎం జగన్  కీలక ఆదేశాలతో ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. నీటి విడుదల కోసం కలెక్టర్లు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు
గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు

గోదావరి డెల్టాకు రబీకి సాగు నీరు

Water for Rabi in Godavari Delta: గోదావరి డెల్టాకు రబీకింద సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ ఆదేశాలమేరకు సీఎంఓ అధికారులు కీలక సమావేశాన్ని నిర్వహించారు. గోదావరి డెల్టా ప్రాంత ఎమ్మెల్యేలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ, నీటి పారుదలశాఖ అధికారులు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కార్యదర్శులు సమావేశమయ్యారు.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

సీఎం జగన్ ఆదేశాలు…

గోదావరి డెల్టా కింద రబీకింద సాగుకు అవసరమైన నీటి వనరుల పరిస్థితులపై సమీక్ష చేశారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ సమర్థవంతమైన నీటి నిర్వహణ ద్వారా రబీకి నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతులకు తప్పకుండా సాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. దీనికోసం ఒక ప్రణాళికను సిద్ధంచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. ఉన్న నీటివనరులు వృథాకాకుండా సాగు భూములకు చేరేలా సమర్థవంతమైన నీటి నిర్వహణకు వారంబందీ సహా అందుబాటులో ఉన్న పద్దతులను అనుసరించాలని నిర్ణయించారు. డెల్టా చివరి భూముల్లో పంటలు ఎండిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపైనా సమావేశంలో చర్చించారు. కాల్వల్లో సాగునీటి ప్రవాహం సవ్యంగా ఉండేలా, షట్లర్లు ఇబ్బందులు ఉంటే వాటిని బాగుచేసేలా అలాగే సాగునీరు అందని భూములకు డీజిలు ఇంజిన్లద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీటిని అందించడానికి అవసరమైన అత్యవసర పనులు మంజూరుచేసి వాటిని వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లష్కర్ల సహా ఎక్కడా కొరతలేకుండా చూడాలని ఆదేశించారు. మెట్టభూముల్లో ఆరుతడి పంటలు, అపరాల సాగును ప్రోత్సహించాలని, ఆమేరకు రైతుల్లో అవగాహన పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

గోదావరి డెల్టాకింద ఉన్న వివిధ జిల్లాల రైతు సలహామండళ్లతో చర్చించి నీటి విడుదలకు అవసరమైన తేదీలను, ఖరారు చేయాలని కలెక్టర్లకు నిర్దేశించారు. కచ్చితమైన షెడ్యూలు ప్రకటించి ఆమేరకు నీటిని అందించేలా చూసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు .దీనికోసం పక్కా ప్రణాళిక సిద్ధంచేసుకోవాలన్నారు. అలాగే ఉన్ననీటి వనరులను జాగ్రత్తగా వాడుకునేలా రైతులకు ఈ సలహామండళ్లద్వారా అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలోకూడా చర్యలు కూడా తీసుకోవాలని కలెక్టర్లకు చెప్పారు. పంటకాలం పూర్తయ్యేంతవరకూ ఇరిగేషన్‌, వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలు పూర్తిసమన్వయంతో పనిచేయాలన్నారు. రబీ ప్లాన్‌ను సిద్ధంచేసుకోవాలిన వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అవసరమైన విత్తనాలు, సాగు పద్ధతులమీద రైతుల్లో అవగాహన పెంచేలా గ్రామస్థాయి వరకూ ప్రణాళిక రూపొందించాలన్నారు.

గోదావరి డెల్టాకింద రబీకి సాగునీరు విడుదలకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు.

తదుపరి వ్యాసం