తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teachers Retirement Age : అధ్యాపకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు

Teachers Retirement Age : అధ్యాపకులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, ఉద్యోగ విరమణ వయసు 65 ఏళ్లకు పెంపు

29 July 2023, 22:55 IST

    • Teachers Retirement Age :యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయసు మరో మూడేళ్లు పెంచుతూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం

Teachers Retirement Age : ఏపీ సర్కార్ అధ్యాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న యూనివర్సిటీల్లో అధ్యాపకుల ఉద్యోగ వివరణ వయస్సును మరో మూడేళ్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అధ్యాపకులు ఉద్యోగ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు జీవో జారీ చేశారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ పరిధిలోని యూనివర్సిటీల్లో అధ్యాపకులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర యూనివర్సిటీల్లో పనిచేస్తూ, యూజీసీ పే స్కేల్ పొందుతున్న అధ్యాపకులకు మాత్రమే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆయా యూనివర్సిటీల రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

AP Weather Updates: పగలు మండే ఎండలు, సాయంత్రానికి భారీ వర్షాలు, ఏపీకి ఐఎండి తీపి కబురు

AP Weather Alert : ఏపీ పోలింగ్ రోజున భిన్నమైన వాతావరణం, ఈ జిల్లాల్లో వర్షాలు!

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ సేవలు మరికొంత కాలం

రాష్ట్ర విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించేందుకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ సేవలు మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) గ్రేడింగ్, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు విశ్వవిద్యాలయాలు పొందేందుకు వీరి సేవలు అవసరమని తెలిపింది. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరో పే కమిషన్ అధ్యాపకులు ఉద్యోగ విరమణ వసులు పెంచాలని సిఫార్సు చేసిందని ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ సిఫార్సులతో ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు పేర్కొంది. సెంట్రల్ రివైజ్డ్ పే స్కేల్‌ను అనుసరించి విశ్వవిద్యాలయాల్లో యూజీసీ వేతన స్కేళ్లను పొందుతున్న అధ్యాపకులకు ఉద్యోగ విరమణ వయస్సు పెంచుతున్నట్లు ప్రకటించింది. అన్ని విశ్వవిద్యాలయాల రిజిస్ట్రార్లు ఈ ఆదేశాలను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ముందు ఉంచి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.

తదుపరి వ్యాసం