తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mlc Election Result: కోర్టు తీర్పుకు లోబడి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం

MLC Election Result: కోర్టు తీర్పుకు లోబడి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం

HT Telugu Desk HT Telugu

16 March 2023, 7:06 IST

    • MLC Election Result: ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం  తుది తీర్పుకు లోబడి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టంచేసింది. ఈ వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
కోర్టు తీర్పుకు లోబడి ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు
కోర్టు తీర్పుకు లోబడి ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు

కోర్టు తీర్పుకు లోబడి ఉత్తరాంధ్ర ఎన్నికల ఫలితాలు

MLC Election Result: ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కోర్టు తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల ఫలితాలను వెల్లడించడాన్ని నిలువరిస్తూఉత్తర్వులివ్వడానికి నిరాకరించిన హైకోర్టు.. పిటిషన్‌ను విచారిస్తామని ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Visakha NAD Accident : విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్ పై నుంచి పడి ఇద్దరు యువకులు మృతి

TTD Admissions 2024 : టీటీడీ జూనియర్ కాలేజీల్లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ - అప్లికేషన్ ప్రాసెస్, ముఖ్య తేదీలివే

AB Venkateswara Rao : ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్ - ప్రాసిక్యూషన్కు కేంద్ర హోంశాఖ అనుమతి..!

IRCTC Tirupati Tour Package : తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల దర్శనం-విశాఖ నుంచి ఐఆర్సీటీసీ ఎయిర్ టూర్ ప్యాకేజీ!

ఎన్నిక రోజు హైకోర్టు సెలవు ప్రకటించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతున్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో న్యాయస్థానాలకు సెలవు ఇవ్వలేదని దీంతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారంటూ విశాఖకు చెందిన న్యాయవాది కోడి శ్రీనివాసరావు హైకోర్టులో బుధవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం బుధవారం పిటిషన్‌పై విచారణ జరిపారు.

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన కోర్టు సిబ్బంది, న్యాయవాదులకు తిరిగి ఎన్నిక నిర్వహించాలని కోరారు. హైకోర్టు న్యాయవాదులకు సెలవు ఇచ్చి, దిగువ కోర్టు న్యాయవాదులకు సెలవు ఇవ్వకపోవడం వివక్ష చూపడమేనన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. తాము ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం ఉంటుందని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 13వ తేదీన జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని విశాఖకు చెందిన న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టులో వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

మార్చి 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అందులో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (తూర్పు రాయలసీమ), కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (పశ్చిమ రాయలసీమ), శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి (ఉత్తరాంధ్ర), ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది.

పోలింగ్ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 16వ తేదీ గురువారం చేపట్టనున్నారు.ఈ క్రమంలో పట్టభద్రుల నియోజకవర్గంలో జరిగిన ఎన్నికకు పోలింగ్ రోజునసెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

''ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చి ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదని దీనివల్ల పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాస్‌కు న్యాయవాదులు, కక్షిదారులు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారని తెలిపారు. రాజ్యాంగపరమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పిటిషన్‌పై వాదనలు విన్న ధర్మాసనం ఓట్ల లెక్కింపు జరిగినా ఫలితం తుది తీర్పునకు లోబడి ఉంటుందని ప్రకటించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా గురువారం వెల్లడి కావాల్సిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తేలాల్సి ఉంది. మిగతా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు మాత్రం 16వ తేదీనే వెల్లడి కానున్నాయి.

తదుపరి వ్యాసం