తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Elephant Attack: పార్వతీపురం మన్యంలో ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి

Elephant Attack: పార్వతీపురం మన్యంలో ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి

HT Telugu Desk HT Telugu

04 September 2023, 12:54 IST

    • Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. అంతరాష్ట్ర రహదారిపై చిందులు తొక్కింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ధ‌్వంసం చేసింది. 
ట్రావెల్స్‌ బస్సుపై ఏనుగు దాడి
ట్రావెల్స్‌ బస్సుపై ఏనుగు దాడి

ట్రావెల్స్‌ బస్సుపై ఏనుగు దాడి

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన మగ ఏనుగు బీభత్సం సృష్టించంిది. రాయగడ నుంచి పార్వతీపురం వెళుతున్న విజయదుర్గా ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఒడిస్సాలోని రాయగడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Tirumala : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ - 3 కిలో మీటర్ల మేర బారులు, దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

కొమరాడ మండలం అర్తం గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రహదారిపై ఏనుగు రెచ్చిపోయింది. ఏనుగు రావడం చూసి బస్సులో ప్రయాణికులు పారిపోయారు. మన్యం అటవీ ప్రాంతంలో ఆరు ఏనుగులు చాలా కాలంగా సంచరిస్తున్నాయి.

వీటిలో హరి అనే మగ ఏనుగు ఒంటరిగా తిరుగుతూ చుట్టు పక్కల ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు గుంపు నుంచి విడిపోయి అంతరాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఆస్తినష్టానికి కారణమైనట్లు స్థానికులు చెబుతున్నారు.

మన్యం ప్రాంతంలో ఆరేడు ఏనుగులు చాలా కాలంగా సంచరిస్తుండటంతో వాటి కదలికల్ని నియంత్రించే అటవీ శాఖ ఇద్దరు ట్రాకర్లను కూడా నియమించింది. సోమవారం ఉదయం పార్వతీపురం మీదుగా శ్రీకాకుళం వస్తుండగా ఏనుగు బస్సును ధ్వంసం చేసింది బస్సును వెనక్కి నెట్టేయడంతో అద్దాలు పగిలిపోయాయి.

ఏనుగుల్ని అటవీ ప్రాంతంలో పంపేందుకు అటవీ శాఖ గతంలో ఇద్దరు ట్రాకర్లను ఏర్పాటు చేశారు. ఏనుగులను దారి మళ్లించే ట్రాకర్ చనిపోవడంతో నాగావళి పరివాహ ప్రాంతంలో ఇవి సంచరిస్తున్నాయి. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏనుగుల సమస్య పరిష్కారం కావట్లేదని ఆరోపిస్తున్నారు.

తదుపరి వ్యాసం