తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap B.ed Counselling : ఎట్టకేలకు ఏపీ బీఈడీ కౌన్సెలింగ్, షెడ్యూల్ ఇదే!

AP B.Ed Counselling : ఎట్టకేలకు ఏపీ బీఈడీ కౌన్సెలింగ్, షెడ్యూల్ ఇదే!

27 January 2024, 15:34 IST

    • AP B.Ed Counselling : ఏపీలో బీఈడీ కౌన్సెలింగ్ ఎట్టకేలకు షెడ్యూల్ విడుదలైంది. హైకోర్టు ఆదేశాలతో ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 31 నుంటి ఫిబ్రవరి 6 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.
బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్
బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్

బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్

AP B.Ed Counselling : ఏపీలో ఎట్టకేలకు బీఈడీ కౌన్సెలింగ్ జరుగనుంది. హైకోర్టు ఆదేశాలతో బీఈడీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జనవరి 29న రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాలతో కౌన్సెలింగ్ నిర్వహరణకు ఏర్పాట్లు చేయాలని ఉన్నత విద్యామండలి ఆదేశాలు జారీచేసింది. కౌన్సెలింగ్ కు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసిన ఉన్నత విద్యామండలి, కన్వీనర్ గా రామ మోహన్ రావును నియమించింది. అయితే యూనివర్సిటీల నుంచి బీఈడీ కాలేజీల జాబితా ఉన్నత విద్యామండిలి ఇంకా అందాల్సి ఉంది. ఈ జాబితా నిర్ణీత సమయంలో అందితే షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Ramanarayanam IRCTC Package : సింహాచలం, శ్రీరామనారాయణం, విశాఖ బీచ్ ల సందర్శన- ఐఆర్సీటీసీ 2 రోజుల టూర్ ప్యాకేజీ వివరాలివే

Anantapur Road Accident : పెళ్లింట తీవ్ర విషాదం - షాపింగ్ కు వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

AP Weather Updates : కొనసాగుతున్న ఆవర్తనం..! ఏపీలో మరో 4 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు

హైకోర్టు ఆదేశాలు

గత ఏడాది జులై 14న ఎడ్ సెట్ ఫలితాలు విడుదల చేశారు. నెలలు గడిచినా ఇప్పటి వరకూ కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో బీఈడీ కళాశాల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు బీఈడీ కౌన్సిలింగ్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏపీలో మొత్తం 411 బీఈడీ కాలేజీలు ఉండగా, 34 వేలకు పైగా సీట్లు ఉన్నాయి.

ఏపీ వ్యాప్తంగా ఉన్న టీచర్‌ ట్రైనింగ్ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఎడ్‌సెట్‌ 2023 నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. బీఈడీ, స్పెషల్‌ బీఈడీలో ప్రవేశాలకు ఏపీ ఎడ్‌సెట్‌-2023 పరీక్ష జూన్ 14న ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించింది.

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీ.ఈడీ ప్రవేశాలు

దూర విద్యలో బీఈడీ చేయాలనుకునేవారికి అప్డేట్ ఇచ్చింది హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ. 2022- 24 అకడమిక్ ఇయర్ కు సంబంధించి బీఈడీ (ODL -Open and Distance Learning) ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఫిబ్రవరి 21వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.

ముఖ్య వివరాలు ఇలా

  • ప్రవేశాల ప్రకటన - డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీ, హైదరాబాద్
  • కోర్సు - బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (B.ed ఓడీఎల్‌ 2023-24)
  • అర్హతలు - అడ్మిషన్ తీసుకునే అభ్యర్థి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం పూర్తి చేసి ఉండాలి.
  • కోర్సు వ్యవధి - 2 సంవత్సరాలు
  • మీడియం - తెలుగు మాధ్యమం.
  • ఎంపిక ప్రక్రియ - ఎంట్రెన్స్ ఎగ్జామ్
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు తుది గడువు - 21.ఫిబ్రవరి.2024.
  • రూ.500 ఫైన్ తో దరఖాస్తులకు తుది గడువు - 26. ఫిబ్రవరి.2024.
  • హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ - 01.మార్చి.2024.
  • ఎంట్రెన్స్ ఎగ్జామ్ తేదీ- 05.మార్చి.2024.
  • ప్రిలిమినరీ కీ - 07.మార్చి.2024.
  • ఫలితాలు -15.మార్చి.2024.
  • అడ్మిషన్ కౌన్సెలింగ్ - మార్చి చివరి వారం, 2024.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.braouonline.in/

తదుపరి వ్యాసం