తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Why Ap Needs Jagan : వై ఏపీ నీడ్స్ కార్యక్రమంపై హైకోర్టులో పిటిషన్, సజ్జలకు నోటీసులు!

Why AP Needs Jagan : వై ఏపీ నీడ్స్ కార్యక్రమంపై హైకోర్టులో పిటిషన్, సజ్జలకు నోటీసులు!

29 November 2023, 14:43 IST

    • Why AP Needs Jagan : వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణ చేపట్టిన కోర్టు సజ్జల సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ఏపీ హైకోర్టు

Why AP Needs Jagan : వైసీపీ ప్రభుత్వం...వై ఏపీ నీడ్స్ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంతో ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని, నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై న్యాయవాదులు ఉమేష్ చంద్ర, నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అయితే ఈ పిల్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ అర్హత ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వ సొమ్ముతో సీఎం జగన్ రాజకీయ ప్రచారం చేస్తున్నారని కోర్టుకు చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందన్నారు. ఈ మేరకు జీవో నెంబర్ 7 విడుదల చేశారని కోర్టు దృష్టికి న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సజ్జల చెప్పారని కోర్టుకు తెలిపారు. ఇలా చెప్పడం సర్వీస్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.

ట్రెండింగ్ వార్తలు

Tirumala VIP Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్ల జారీ తిరిగి ప్రారంభం

Nandi Hills Tour : నంది హిల్స్ -వీకెండ్ ట్రిప్ బెస్ట్ స్పాట్, ప్రశాంతతను పలకరించండి!

AP Inter Admissions: రేపటి నుంచి ఏపీ ఇంటర్ తొలిదశ అడ్మిషన్లు, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం

SIT Report to Ec: ఏపీ ఎన్నికల ఘర్షణల్లో 1370మంది నిందితులు, 124మంది అరెస్ట్, కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన నివేదిక

ప్రభుత్వ ఉద్యోగులతో రాజకీయ కార్యక్రమం

వై ఏపీ నీడ్స్ జగన్ రాజకీయ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొనకుండా నిలువరించాలని హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలైంది. రాజకీయ కార్యక్రమానికి ప్రభుత్వ ధనాన్ని వినియోగించకుండా అడ్డుకోవాలని మంగళగిరికి చెందిన జర్నలిస్టు కట్టెపోగు వెంకయ్య ఈ పిటిషన్ వేశారు. పలువురు అధికారులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిల్ లో కోర్టును కోరారు. సీఎస్, సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్‌, పురపాలకశాఖ, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీరు శాఖల ముఖ్య కార్యదర్శులు, కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి, వ్యక్తిగత హోదాలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. తాజాగా వీరందరికీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు వైసీపీతో కలిసి పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల మీడియా సమావేశంలో బహిరంగంగా ప్రకటించారని పిటిషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఉద్యోగులపై ఒత్తిడి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేసేలా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రభావితం చేసేలా ఈ కార్యక్రమం ఉందని పిటిషన్ కోర్టుకు తెలిపారు. కేవలం జగన్‌ను గురించి చెప్పుకోవడానికే రూ.10 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు నిబంధనలకు విరుద్ధమని పిల్‌లో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఉద్యోగులు పాల్గొ్న్న కార్యక్రమాలలో వైసీపీ జెండాలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా ఉన్నతాధికారులు... ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు స్పష్టమవుతోందని పిల్ లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడకుండా తటస్థంగా ఉండాలని నిబంధలు చెబుతున్నాయని పిటిషన్ కోర్టుకు తెలిపారు.

తదుపరి వ్యాసం