తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Employees : గవర్నర్ ని కలిసిన ఉద్యోగ సంఘానికి సర్కార్ నోటీసులు...

AP Employees : గవర్నర్ ని కలిసిన ఉద్యోగ సంఘానికి సర్కార్ నోటీసులు...

HT Telugu Desk HT Telugu

23 January 2023, 16:01 IST

    • AP Employees : జీతాలు, ఆర్థిక ప్రయోజనాల విషయాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసిన ఉద్యోగ సంఘానికి ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది. ఎంప్లాయిస్ అసోసియేషన్ కు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. గుర్తింపుని ఎందుకు రద్దు చేయకూడదో వారం రోజుల్లో చెప్పాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. 
ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం నోటీసులు
ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం నోటీసులు

ఉద్యోగ సంఘానికి ప్రభుత్వం నోటీసులు

AP Employees : ఏపీ ప్రభుత్వం, ఉద్యోగుల సంఘానికి మధ్య వివాదం మరింత ముదురుతోంది. వేతనాలు, ఆర్థిక అంశాల విషయంలో ఉద్యోగ సంఘం గవర్నర్ కు ఫిర్యాదు చేయడాన్ని సీఎం జగన్ సర్కార్ తప్పుపట్టింది. ఈ మేరకు ఉద్యోగ సంఘానికి నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం.. వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా... గవర్నర్ ని ఎందుకు కలిశారని ప్రశ్నించింది. రోసా( Recognition of Service Association Rules) నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొంటూ... వివరణ ఇచ్చేందుకు వారం రోజుల గడువు ఇచ్చింది.

ట్రెండింగ్ వార్తలు

TTD August Online Quota: రేపు ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..

DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

Arakku Simhachalam Tour : అరకు, సింహాచలం ట్రిప్ - సబ్‌మెరైన్ మ్యూజియం కూడా చూడొచ్చు, టూర్ ప్యాకేజీ వివరాలివే

AP ITI Admissions 2024 : ఏపీలో ఐటీఐ ప్రవేశాలు - దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడంటే..?

నోటీసులపై స్పందించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు.. రూసా నిబంధనల పేరుతో నోటీసులు జారీ చేయడం చిత్రంగా ఉందని అన్నారు. ఉద్యోగుల సమస్యలు ప్రస్తావించడమే మా తప్పా ? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సమాధానం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం వారం రోజులు గడువు ఇచ్చిందని... అన్ని అంశాలతో సమగ్ర వివరణ ఇచ్చేందుకు కావాలంటే గడువు పెంచాలని కోరతామని పేర్కొన్నారు. తమకు వర్తింపజేసిన రూసా నిబంధనను.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మిగతా 104 సంఘాలకు వర్తింపజేయాలని స్పష్టం చేశారు. తమకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన మరో ఉద్యోగ సంఘానికి భవిష్యత్తులో ఇవే పరిస్థితులు వస్తాయని... ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. గుర్తింపు సంఘాలన్నీ ఈ విషయంలో జాగృతం కావాలని... సమస్యలపై ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతభత్యాలు అందేలా చట్టం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఇటీవల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ను కలిశారు. సమయానికి జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జిపిఎఫ్‌, బీమా సొమ్ముల్ని ప్రభుత్వం వాడేసుకోవడంపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఆర్ధిక క్రమశిక్షణ పాటిస్తూ ఫైనాన్షియల్ కోడ్‌లోని 72వ నిబంధన ప్రకారం ఉద్యోగులు, పెన్షన్లు, ఇతర క్లెయిమ్స్‌ను మొదటి హక్కుదారులుగా చేర్చాలని గవర్నర్‌ను కోరారు. ప్రభుత్వ పెద్దలు, ఆర్ధిక శాఖ అధికారులు, మంత్రి వర్గ ఉపసంఘంతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, వారు హామీలకు మాత్రమే పరిమితం అవుతున్నారని, ప్రభుత్వంతో చర్చలు, సమావేశాలు నిష్ప్రయోజనమని భావిస్తున్నామని ప్రకటించారు. ఏప్రిల్ నెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలతో పాటు అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.

తదుపరి వ్యాసం