తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మత ప్రాదికపదికన ఉన్న రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణలో ఆ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాట్లాడిన కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని మండిపడ్డారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేకంగా ఒక వింగ్ ఏర్పాటు చేసి న్యాయ సాయం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. డీజిల్, పెట్రోల్ పై వ్యాట్ తగ్గించి యువతను ఆదుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ మేనిఫెస్టో పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు అన్నారు.