'ఉక్రెయిన్​పై​ పుతిన్​ చేస్తున్నది నేరం..'-russian pilot tells passengers war in ukraine is crime ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /   'ఉక్రెయిన్​పై​ పుతిన్​ చేస్తున్నది నేరం..'

'ఉక్రెయిన్​పై​ పుతిన్​ చేస్తున్నది నేరం..'

Mar 14, 2022 06:20 PM IST HT Telugu Desk
Mar 14, 2022 06:20 PM IST

ఉక్రెయిన్​పై దండయాత్ర నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ మీద సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. సోంత ప్రజలు కూడా పుతిన్​పై మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ రష్యన్​ పైలట్​.. పుతిన్​పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. పొబేడా విమానంలో ప్రయాణించిన ఆయన.. ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. 'నేను మీ కెప్టెన్​ మాట్లాడుతున్నా. ఆట్లాయాకు స్వాగతం. పొబేడాలో ప్రయాణిస్తున్నందుకు ధన్యవాదాలు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.. ఉక్రెయిన్​పై యుద్ధం అనేది నేరంతో సమానం,' అని ఆ పైలట్​ అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పుతిన్​కు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదురువుతాయి అని తెలిసి కూడా.. నిజాన్ని నిర్భయంగా మాట్లాడినందుకు ఆ పైలట్​కు నెటిజన్లు సెల్యూట్​ చేస్తున్నారు.

More