BEreal on Social Media | ఫిల్టర్లు లేకుండా ఒరిజనల్ ఫేస్ చూపించాలి.. ఈ సోషల్ మీడియా యాప్ గురించి తెలుసా?-is bereal app the future of social media check details in video ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Bereal On Social Media | ఫిల్టర్లు లేకుండా ఒరిజనల్ ఫేస్ చూపించాలి.. ఈ సోషల్ మీడియా యాప్ గురించి తెలుసా?

BEreal on Social Media | ఫిల్టర్లు లేకుండా ఒరిజనల్ ఫేస్ చూపించాలి.. ఈ సోషల్ మీడియా యాప్ గురించి తెలుసా?

Sep 07, 2022 06:33 PM IST HT Telugu Desk
Sep 07, 2022 06:33 PM IST

  • ఈరోజుల్లో బ్యాంక్ అకౌంట్ లేని వారైనా ఉంటారు గానీ, సోషల్ మీడియాలో అకౌంట్లు లేని వారంటూ ఉండరు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యక్తులు వారు పెట్టుకునే పేర్లు, ఫోటోలు నిజంగా వారివేనో, కాదో అనేది మనకు తెలియదు. అన్ని సంస్థలకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ అకౌంట్లు అనేవి చాలా ఉంటాయి. ఒక వ్యక్తే వివిధ పేర్లు, ఇతరుల ఫోటోలతో ఖాతాలు తెరిచి అవతలివారి మోసం చేస్తున్నారు. ఫేక్ అకౌంట్ల కట్టడికి ఆయా సంస్థలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం ఉండటం లేదు. అయితే ఈ తరహా నకిలీలకు చెక్ పెడుతూ BEreal అనే సరికొత్త సోషల్ మీడియా యాప్ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. ఫేక్ ప్రొఫైల్స్ రహితమైన సోషల్ మీడియా యాప్‌గా BEreal ఇప్పుడు మిగతా సంస్థలకు దారి చూపిస్తుంది. మిమ్మల్ని మీరు నిజాయితీగా చూపించుకోండి, బీ రియల్ అని చెప్తోంది. ఇందులో ఫోటోలు పోస్ట్ చేయాలంటే వారి లైవ్ ఫోటో తీస్తేనే అనుమతిస్తుంది. అలాగే ఎలాంటి ఫిల్టర్స్, ఎడిట్స్ ఉపయోగించకుండా పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్ ఇండియాలో లేదు, యూరోప్ దేశాలు, జపాన్, కొరియా, పోర్చుగ్రీసులో అందుబాటులో ఉంది. మరింత సమాచారం ఈ వీడియోలో చూడండి.

More