వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి తగాదాల అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో మాజీ సీఎం వైఎస్ జగన్, చెల్లెలు వైఎస్ షర్మిల లేఖల వ్యవహారం బయటకు వచ్చింది. దీనిపై విజయనగరం పర్యటనలో జగన్ స్పందించారు. తన చెల్లి, తల్లి ఫోటోలతో రాజకీయం చేస్తున్నారని.. వారి ఇళ్లలో ఇలాంటి సమస్యలు లేవా అని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండే విషయాలేనని స్వార్థం కోసం వీటిని పెద్దది చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా వక్రీకరించి చూపించడం మానుకోవాలని హితవు పలికారు.