east-godavari News, east-godavari News in telugu, east-godavari న్యూస్ ఇన్ తెలుగు, east-godavari తెలుగు న్యూస్ – HT Telugu

Latest east godavari Photos

తూర్పుగోదావరి జిల్లాలోని సప్తగోదావరి తీరాన వెలసిన భీమేశ్వరమూర్తిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయి. కాశ్యాంతు మరనాన్ముక్తిఃజీవనం మరణం వాపి శ్రేయో భీమేశ్వరపట్టణే.. అంటే..‘కాశీలో నివసిస్తే మరణానంతరం మోక్షం లభిస్తుంది. భీమేశ్వరుడిని పూజిస్తే, కొన్ని క్షణాలైనా ఆయన సన్నిధిలో గడిపితే జీవన సౌఖ్యం, కైవల్యం రెండూ లభిస్తాయి’ అని అర్థం. తెలుగుసీమ పంచారామాలకు ప్రసిద్ధి చెందింది. త్రిపురాసురుణ్ణి పాశుపతాస్త్రంతో అంతమొందించిన పరమేశ్వరుడు, ఆ అసురుడు అర్పించే శివలింగాన్ని అయిదు ఖండాలు చేయగా.. అవి ప్రతిష్ఠితమైన ప్రాంతాలే పంచారామాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ లింగ శకలాలు పాలకొల్లులో క్షీరారామేశ్వరుడిగా, సామర్లకోటలో కొమరారామ మూర్తిగా, అమరావతిలో అమరేశ్వరుడిగా, భీమవరం, ద్రాక్షారామ క్షేత్రాల్లో భీమేశ్వరుడుగా పూజలు అందుకొంటున్నాయి.

AP Tourism : చరిత్ర చెప్పని ఎన్నో రహస్యాలు ఈ క్షేత్రం సొంతం.. ద్రాక్షారామం దర్శనం పూర్వజన్మ సుకృతం

Sunday, November 24, 2024

యానాంలో రాజీవ్‌ రివర్‌ బీచ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఏనుగులు అభిషేకం చేసున్న శివ లింగం, భారతమాత విగ్రహం, బ్రెజిల్‌ యేసు విగ్రహం నమూనాలో ఉన్న మౌంట్‌ ఆఫ్‌ మెర్సీలకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. గరియాలతిప్ప వద్ద మడ అడవుల్లో 1.50 కి.మీ పొడవున చెక్కల నడక దారి.. బోటు షికారు ఆనందాన్ని పంచుతోంది.

AP Tourism : రా.. రమ్మని పిలుస్తున్న గోదారి అందాలు.. ఎంజాయ్‌మెంట్‌కు ఇదే సరైన సమయం

Sunday, October 27, 2024

గత ఘటనల దృష్ట్యా… పాపికొండల్లో ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి రక్షణ చర్యలతో పాపికొండల విహారయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Papikondalu Tourism : పాపికొండలు చూసొద్దాం...చలో చలో..! నేటి నుంచి రాకపోకలు షురూ, మొదలైన టూరిస్టుల సందడి

Saturday, October 26, 2024

అంతర్వేదిలో అన్నచెల్లెల్ల గట్టు చాలా ఫేమస్. సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా విశ్వస్తారు. సముద్రంలో వశిష్ట నది కలిసే చోటును అన్నా చెల్లెల్ల గట్టు అంటారు. ఇక్కడ సముద్రం, నది కలిసే చోట కొంత భాగం ఇసుకతో గట్టులాగా ఉంటుంది. ఇక్కడ రెండు రకాల నీటిని చూడొచ్చు. సముద్రం వైపు ఇసుక, మట్టితో నీరు కనిపిస్తుంది. వశిష్ట నది వైపు తేటగా స్వచ్ఛమైన నీరు కనిపిస్తుంది.

Antarvedi: అంతర్వేది.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రాంతం.. మీరూ ప్లాన్ చేసుకొండి..

Sunday, August 25, 2024

వివిధ ర‌కాల ఆహారం, స్వీట్స్‌, హాట్‌, ఫ్రూట్స్ ఇలా వంద రకాల వంటకాలు అల్లుడి ముందు ఉంచారు. బిర్యానీ, పులిహార‌, ప‌ర‌మ‌న్నం, లెమ‌న్ రైస్‌, గ్రీన్ రైస్ వంటి ఆహార ప‌దార్థాలు పెట్టారు. అలాగే చేప‌లు, పీత‌లు, మ‌ట‌న్‌, చికెన్, రొయ్యలు వంటి నాన్ వెరైటీలు విందులో ఏర్పాటు చేశారు.

Kakinada News : గోదారోళ్ల ఆతిథ్యం అదుర్స్‌, కొత్త అల్లుడికి 100 ర‌కాల వంట‌కాలతో మెగా విందు

Sunday, August 11, 2024

1975లో విడుదలైన పాడిపంటలు సినిమా నుంచి రామ్ చరణ్ రంగస్థలం వరకు ఎన్నో వందల సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. గోదావరి ఒడ్డునున్న ఈ చెట్టు వద్ద సినిమా సీన్ తీస్తే హిట్టు పక్కా అనే నమ్మకం స్థానికంగా ఉంది.

Cinema Chettu : 150 ఏళ్ల చరిత్ర, 300 సినిమాల షూటింగ్స్-నేలకొరిగిన సినిమా చెట్టు

Tuesday, August 6, 2024

మ‌రిడ‌మ్మ ఆషాఢ‌మాసం జాత‌ర జులై 5 నుంచి ఆగ‌స్టు 10 వ‌ర‌కు 37 రోజుల పాటు జ‌రుగుతోంది. జులై 4 (గురువారం) రాత్రి జాగ‌ర‌ణ ఉత్సవంతో జాత‌ర ప్రారంభం అయింది. ప్రధానంగా మంగ‌ళ‌వారం, గురువారం, ఆదివారాల్లో భ‌క్తుల తాకిడి భారీగా ఉంటుంది. దాదాపు నెల‌కు పైగా జ‌రిగే ఉత్సవం కావడంతో గోదావ‌రి జిల్లాల్లో చాలా ప‌విత్రంగా చూస్తారు. ఆయా జిల్లాల్లో ఇత‌ర రాష్ట్రాలు, రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లోని నివాసం ఉంటున్నవారు కూడా ఈ ఉత్సవానికి వ‌చ్చి అమ్మ వారిని ద‌ర్శించుకుంటున్నారు.

Peddapuram Maridamma Jatara : అంగరంగ వైభవంగా పెద్దాపురం మ‌రిడ‌మ్మ జాతర, ల‌క్షలాదిగా తరలివస్తున్న భ‌క్తులు

Sunday, August 4, 2024

గోదావరి జిల్లాలంటేనే పచ్చని పంట పొలాలు, గోదావరి నది, గోదారోళ్ల ఎటకారం గుర్తుకొస్తాయి. అయితే వీటితో పాటు మ‌రో ముఖ్యమైనది ఇంకొకటి ఉంది. అదేంటంటే వారి ఆతిథ్యం. గోదారోళ్ల ఆతిథ్యం బ‌హు అమోఘంగా ఉంటుంది. గోదారోళ్లు పెట్టే భోజ‌నంపై అనేక వ్యాఖ్యానాలు, సామెతలు ఉన్నాయి. భోజ‌నం పెట్టడంలో ఎక్కడా వెన‌క‌డుగు వేయ‌రని అంటుంటారు.

Pulasa Fish : గోదారోళ్ల ఆతిథ్యమా మజాకా! ఖరీదైన పులస చేపతో విందు

Tuesday, July 30, 2024

అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని రాజ‌వొమ్మంగి, జీకే వీధి, ఎట‌పాక‌, మారేడుమిల్లు మండ‌లాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవ‌హిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాల‌కు రాక‌పోక‌లు నిలిచిపోయాయి. వీఆర్ పురం మండ‌లంలో గోదావ‌రి న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలైన తుమ్మలేరు పంచాయ‌తీ, శ్రీ‌రామ‌గిరి పంచాయ‌తీల్లో నాలుగు గ్రామాల చొప్పున ముంపులో ఉన్నాయి. వీరంత కొండ‌లు, గుట్టల‌పైకి ప‌రుగులుతీశారు. వీరి క‌నీసం అవ‌స‌రాలు తీర్చే నాధుడు కూడా లేడు.

AP Flood Effects : ఉమ్మడి గోదావ‌రి జిల్లాలను ముంచెత్తిన వరద, రైతన్నలకు అపార నష్టం

Sunday, July 21, 2024

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ప్రవాహం క్రమంలో పెరుగుతోంది. పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.

Polavaram Project : పోలవరం ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి, స్పిల్ వే నుంచి ప్రవహిస్తున్న గోదావరి వరద

Wednesday, July 10, 2024

గోదావరిలో  వరద ఉధృతి పెరిగింది.  భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44 అడుగులు దాటింది. దీంతో అధికారులు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు.

Godavari Floods: గోదావరికి వరద ఉద్ధృతి.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Wednesday, July 26, 2023