Rain Alert Telangana: మరో 2 రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్-weather updates of telangana and andhrapradesh over imd issued yellow alert
Telugu News  /  Telangana  /  Weather Updates Of Telangana And Andhrapradesh Over Imd Issued Yellow Alert
మరో రెండు రోజులు భారీ వర్షాలు
మరో రెండు రోజులు భారీ వర్షాలు (twitter)

Rain Alert Telangana: మరో 2 రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

29 September 2022, 10:58 ISTHT Telugu Desk
29 September 2022, 10:58 IST

Rain Alert Telugu States : పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. గురు, శుక్రవారం కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది.

Rain Alert Telangana: రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం,దాని పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు ఇవాళ, రేపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆసిఫాబాద్, నిజామాబాద్, కొత్తగూడెం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది.

ఏపీలో ఇలా….

Rain Alert Andhrapradesh ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. తూర్పుగోదావరి, యానాం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల పిడిగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Hyderabad Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరాన్ని భారీవర్షం మరోమారు ముంచెత్తింది. బుధవారం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి రహదారులు నీటమునిగాయి. నాగోల్‌, సరూర్‌నగర్,వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్‌, చంపాపేట్, సైదాబాద్‌, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట ప్రాంతాల్లో సుమారు గంటపాటు భారీవర్షం కురిసింది. ఫలితంగా హైదరాబాద్‌- విజయవాడ హైవేపై పలుచోట్ల నిలిచిన వర్షం నీరు నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ నిలిచిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రోడ్లపైకి చేరడంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చింతల్‌కుంట చెక్‌పోస్టు వద్ద రోడ్డుపై వరదనీరు చెరువును తలపించింది.