IMD Heavy rain alert: ఏపీ, తెలంగాణ సహా 4 దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు
IMD Heavy rain alert: ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా 4 దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే శుక్రవారం వరకు భారీ వర్షాలు కురవనున్నాయి.
IMD Heavy rain alert: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిల్లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని తన అంచనాలను వెల్లడించింది. రానున్న రెండు మూడు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రుతుపవనాలు వెనక్కి మళ్లుతాయని కూడా ఐఎండీ తెలిపింది.
Monsoon withdrawal: రుతుపవనాల ఉపసంహరణ
నైరుతి రుతుపవనాల ఉపసంహరణ బికనీర్, జోధ్‌పూర్, నాలియా గుండా సాగుతుంది.
రాబోయే 2-3 రోజులలో వాయువ్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాలు, మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలించనున్నాయి.ః
Heavy rain alert: భారీ వర్షాల హెచ్చరిక
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దిగువ, మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తుపాను విస్తరిస్తోంది. దీని ప్రభావంతో సెప్టెంబరు 27 నుంచి సెప్టెంబరు 30 వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి.
సెప్టెంబరు 27వ తేదీన ఉప హిమాలయ ప్రాంతం పశ్చిమ బెంగాల్, సిక్కింలలో, సెప్టెంబర్ 28, 29 తేదీల్లో ఒడిశాలో చాలా విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
27న అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలలో, అలాగే సెప్టెంబర్ 29, 30 తేదీల్లో అండమాన్, నికోబార్ దీవులలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి.
టాపిక్