TSSPDCL: ఈనెల 31న సబ్ ఇంజినీర్‌ ఎగ్జామ్ - ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే-tsspdcl sub engineer hall tickets released and exam on 31st july 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsspdcl: ఈనెల 31న సబ్ ఇంజినీర్‌ ఎగ్జామ్ - ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే

TSSPDCL: ఈనెల 31న సబ్ ఇంజినీర్‌ ఎగ్జామ్ - ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే

HT Telugu Desk HT Telugu
Jul 29, 2022 07:37 PM IST

TSSPDCL Recruitment 2022: తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-TSSPDCL ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? అయితే ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల హాల్ టికెట్స్ విడుదలయ్యాయి. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.
సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు హాల్‌ టికెట్లు విడుదల.

tsspdcl sub engineer hall tickets తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్.. సబ్ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్) పోస్టుల రాత పరీక్షకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. పరీక్షకు సంబంధించి హాల్‌ టికెట్లు జూలై 26న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్ధులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 201 సబ్‌ ఇంజనీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు జూలై 31న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ లోని వివిధ కేంద్రాల్లో ఉదయం 10:30 గం. నుండి మధ్యాహ్నం 12:30 గం. వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంస్థ వెబ్ సైట్ నుంచి www.tssouthernpower.cgg.gov.in నుండి హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు...

రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్ లో పొందు పరిచిన సూచనలను తప్పనిసరిగా పాటించాలి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ తో పాటు ఫోటో స్పష్టంగా కనిపించే విధంగా ఉన్న ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలి. (ఆధార్ కార్డు / పాన్ కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలి.

సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్/ స్మార్ట్ వాచీలతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రం లోనికి అనుమతించబడవు.

అభ్యర్థులను రాత పరీక్ష సమయం 10:30 గంటలకు తరవాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మరియు 12:30 గంటలకు ముందు పరీక్ష కేంద్రం నుంచి బయటకు అనుమతించరు.

రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రం, సమయం వంటి వివరాలు ముందుగానే సరిచూసుకుని పరీక్ష సమయానికి కనీసం 60 నిముషాలు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి.

చివరి నిమిషంలో హడావుడితో ఒత్తిడికి లోనవొద్దని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

IPL_Entry_Point

టాపిక్