BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ - రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందం
BRS Ex MLA Jeevan Reddy : ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అధికారులు. ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకొని నిర్మించిన జీవన్ మాల్ బకాయిలు చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు మాల్ ను టాస్క్ ఫోర్స్ బృందం పరిశీలించింది.
BRS Ex MLA Jeevan Reddy : అసెంబ్లీ ఎన్నికల ఓటమిపాలైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు షాకిచ్చారు. ఆర్టీసీ స్థలం లీజుకు తీసుకొని నిర్మించిన జీవన్ మాల్ బకాయిలు చెల్లించాలని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఆర్టీసీ టాస్క్ఫోర్స్ అధికారులు గురువారం జీవన్ మాల్ ను పరిశీలించారు. సుమారు ఏడు కోట్ల బకాయిల వరకు జీవన్ రెడ్డి చెల్లించాల్సి ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
జీవన్ రెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డి పేర "విష్ణు జీత్ ఇఫ్రా లిమిటెడ్" సంస్థ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణ స్థలన్ని లీజుకు తీసుకుని "జీవన్ మాల్" నిర్మించారు. గురువారం హైదరాబాద్ నుండి ఆర్టీసీ టాస్క్ ఫోర్స్ అధికారులు జీవన్ మాల్ పరిశీలించి లీజు బకాయిలు చెల్లించాల్సిందే అని బహిరంగంగా మైక్ ద్వారా ప్రకటించారు . అలాగే అందులో ఉన్న దుకాణ సముదాయ యాజమానులకు జీవన్ మాల్ లో ఉన్న దుకాణాలను ఖాళీ చేయాలని హెచ్చరించారు. లేకపోతే వారం రోజులలోపు జీవన్ మాల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు.
జీవన్ మాల్ బకాయిలు సుమారుగా ఏడు కోట్ల వరకు ఉన్నాయని అధికారులు వివరించారు.గత నెలలో డబ్బులు కట్టాలని హుకుం జారీ చేసిన సంబంధిత యజమానురాలు పెడ చెవిన పెట్టిందన్నారు. అప్పుడే డిసెంబర్ మూడో తారీకు లోపు బకాయిలు కట్టకపోతే సీజ్ చేయడం జరుగుతుందని టాక్స్ ఫోర్స్ అధికారులు తెలిపినట్లు ఆర్మూర్ ఆర్టిసి డిపో సూపర్డెంట్ పృధ్విరాజ్ గౌడ్ విలేకరులతో తెలిపారు.
ఈ జీవన్ మాల్ విష్ణు జీత్ ఇఫ్రా లిమిటెడ్ అనే కంపెనీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజిత రెడ్డి పేరుపై కొనసాగుతుందని ఆర్టీసీ సూపరింటెండెంట్ వివరించారు. ఏదేమైనప్పటికీ జీవన్ మాల్ లో ఉన్నటువంటి దుకాణాల యాజమానులు వారి ఫర్నిచర్ సామగ్రి వస్తువులను తీసుకొని వెళ్లాలని అధికారులు ఆదేశించారు.
ఆర్టీసీ ప్రంగాణంలో లీజుకు తీసుకొని ఎమ్మెల్యే సతీమణి నిర్మాణ పనులు ప్రారంభించిన నాటి నుండి రాజకీయ విమర్శలకు కేంద్రంగా మారింది.అప్పటి స్థానిక ప్రతిపక్ష నేతలు కొంత భయపడి విమర్శలు చేయనప్పటికీ ప్రతిపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు అప్పటి పిసిసి చీప్ రేవంత్ రెడ్డి ఆర్మూర్ వచ్చినప్పుడు కచ్చితంగా జీవన్ రెడ్డి మాల్ ప్రస్తావన తెచ్చి విమర్శించే వారు. అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి తనపై వచ్చిన విమర్శలను పట్టించుకోకుండా మోండిగా వ్యవహరించారు.
రిపోర్టింగ్ : నిజామాబాద్ ప్రతినిధి.
"