TSRTC Rakhi Lucky Draw : మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్, రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాలో లక్షల విలువైన బహుమతులు-tsrtc good news to women travelers lucky draw lakh worth of gifts on raksha bhandhan ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tsrtc Rakhi Lucky Draw : మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్, రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాలో లక్షల విలువైన బహుమతులు

TSRTC Rakhi Lucky Draw : మహిళలకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్, రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాలో లక్షల విలువైన బహుమతులు

TSRTC Rakhi Lucky Draw : రక్షాబంధన్ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా విలువైన బహుమతులు అందిస్తామని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ లక్కీ డ్రా

TSRTC Rakhi Lucky Draw : రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించనున్నట్లు ప్రక‌టించింది. ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని సూచించింది. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాల్సి ఉంటుంది. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.

లక్కీ డ్రాలో ద్వారా బహుమతులు

మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. అత్యంత పవిత్రంగా ఈ పండుగను జరుపుకుంటారని, సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు రాఖీలు కడుతుంటారని గుర్తుచేశారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో ఈ పండుగ నాడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందించాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చని తెలిపారు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వేయాలని సూచించారు. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోందన్నారు. సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేస్తామన్నారు.

3 వేల స్పెషల్ బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. రాఖీ పౌర్ణమికి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. రక్షాబంధన్‌కు రాష్ట్రవాప్తంగా 3 వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక సర్వీసులను ఈ నెల 29, 30, 31 తేదీల్లో ప్రతి రోజు 1000 బస్సుల చొప్పున నడపనున్నట్లు పేర్కొన్నారు.