Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌….-ts bjp president bandi sanjay arrested by police ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌….

Bandi Sanjay : బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌….

HT Telugu Desk HT Telugu
Aug 23, 2022 11:13 AM IST

ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ పాత్రపై విచారణకు డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న బండి సంజయ్‌ను జనగామలో పాదయాత్ర శిబిరం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

<p>బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు</p>
బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం తెలంగాణలో అగ్గి రాజేసింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీ వ్యవహారంలో టీఆర్‌ఎస్‌ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్ని కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత తోసిపుచ్చారు. మరోవైపు కవిత ఇంటి వద్ద ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై టిఆర్‌ఎస్‌ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు అరెస్ట్‌ చేసిన బీజేపీ కార్యకర్తల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో బీజేపీ ఆందోళనల్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో దీక్ష చేస్తున్న ప్రాంతంలోనే సంజయ్ యాత్రకు సిద్ధమవ్వడంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు.

మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహిస్తున్న సంజయ్ జనగామ పాదయాత్ర శిబిరం నుంచి దీక్షకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్‌ యాత్రకు వర్ధన్నపేట, జనగామ నుంచి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. బండి సంజయ్‌ దీక్షకు దిగకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు తరలివచ్చారు. జనగామ పాదయాత్ర శిబిరంలో దీక్ష నిర్వహిస్తానని బండి సంజయ్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. బండి సంజయ్‌ బస చేసిన ప్రాంగణం నుంచి దీక్షా స్థలికి చేరుకునే క్రమంలో పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల్ని బండి సంజయ్‌ను అరెస్ట్ చేయకుండా అడ్డుకునేందుకు కార్యకర్తలు తీవ్రంగా ప్రయత్నించారు.

పామ్నూర్‌లో బండి సంజయ్‌ ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు వ్యతిరేకంగా దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. బండి సంజయ్‌ను పోలీసులు బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించడంతో కార్యకర్తలు వాహనానికి అడ్డుగా కూర్చున్నారు. మరోవైపు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. జనగామలో బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపి శ్రేణులు రెచ్చిపోయారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. దీక్ష సందర్భంగా బండి సంజయ్‌కు భద్రత కల్పించలేమనే ఉద్దేశంతోనే బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు బీజేపీ ఆందోళనను అడ్డుకునేందుకు టిఆర్ఎస్‌ నేతలు పోటీగా భారీ ఆందోళనకు సిద్ధమయ్యారనే సమాచారంతోనే బండి సంజయ్‌ను అడ్డుకున్నామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

బండి సంజయ్‌ దీక్షతో టీఆర్ఎస్‌ భయపడుతోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. లిక్కర్‌ స్కాం వ్యవహారంలో ఆరోపణలకు సమాధానం చెప్పలేకే పోలీసులతో ఉద్యమాన్ని అణిచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పోలీసు వాహనాలకు అడ్డుగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బైఠాయించారు. రోప్ పార్టీలతో వారిని అడ్డు తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

Whats_app_banner