Hyd : పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భారీ చోరీ.. కాపర్ బండిల్స్ కొట్టేశారు
జూబ్లీహిల్స్ లో నిర్మాణంలో ఉన్ిన పోలీసు కమాండ్ కంట్రోల్ భవనంలో చోరీ జరిగింది. ఏకంగా 30 కాపర్ బండిల్స్‌ను ఎత్తుకెళ్లటం సంచలనంగా మారింది.
Theft at Police Command control center: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్.... తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న భవనం..! రాష్ట్రవ్యాప్తంగా ఏం జరుగుతుందనేది లైవ్ లో తెలుసుకునేలా నూతన సాంకేతిక విధానంతో పనులు చేపట్టారు. దాదాపు పనులు కూడా పూర్తయ్యే దశకు చేరుకుంటున్నాయి. ఇలాంటి క్రమంలో.. అలాంటి భవనానికే ఎసరు పెట్టారు దొంగలు. ఈ భవనానికి సంబంధించి.. దాచి ఉంచిన 38 కాపర్ బండిల్స్‌ను ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుంది.
రంగంలోకి పోలీసులు...
ఈ ఘటనపై నిర్మాణ సంస్థ ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించి నిర్మాణ సంస్థ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఇంటి దొంగల పనా...? లేక బయటి వ్యక్తులు ఎవరైనా చేశారా..? అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఈ కమాండ్ సెంటర్ భవనం ఒక లక్షా 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది. తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్ రాడార్ పరిధిలోకి వస్తుంది. ఈ బిల్డింగ్ అందుబాటులోకి వస్తే .. రాష్ట్రంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో కనిపెట్టొచ్చు. ఈ భవనం నిర్మాణం 350 కోట్ల అంచనా వ్యయంతో మొదలు పెట్టినా.. తర్వాత మరో 200 కోట్లు కేటాయించారు. 7 ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో నాలుగు బ్లాకుల్లో ఏ, బీ, సీ, డీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లుంటాయి. ఇక టవర్-ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉండగా.. టవర్-బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి.
టాపిక్