AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల
AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 46డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఈ వారం ఉష్ణోగ్రతలు 46డిగ్రీలను దాటేయనున్నాయి.
AP TS Weather Updates: ఆంధ్రా, తెలంగాణల్లో ఎండలు Summer మండిపోతున్నాయి. తెల్లవారడమే అధిక ఉష్ణోగ్రతలు High Temparatures నమోదవుతున్నాయి. సూర్యోదయం నుంచే వేసవి తీవ్ర కనిపిస్తోంది. Weather వాతావరణంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది.
ఆదివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు, వైయస్సార్ జిల్లా చాపాడులో 45.9° డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలు జిల్లా గూడూరులో 45.5° డిగ్రీలు, విజయనగరం జిల్లా రామభద్రపురంలో 45.2°డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా మక్కువలో 45.1°డిగ్రీలు, పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 45°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు.
సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 47 మండలాల్లో తీవ్రవడగాల్పులు Severe Heat Waves, 151 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 61 మండలాల్లో తీవ్రవడగాల్పులు,159 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
తెలంగాణలో కూడా అంతే…
ఎండల తీవ్రతకు తెలంగాణ భగభగలాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా దాదాపు ఐదు డిగ్రీల అధికంగా నమోదు అవుతున్నాయి. గత వారం రోజులుగా 45డిగ్రీలను దాటి ఎండలు మండిపోతున్నాయి.
ఆదివారం తెలంగాణలో ఆరు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.4డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములు, జయశంకర్ భేపాలపల్లి, జగిత్యాల, వనపర్తి జిల్లాల్లోని పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో 45 డిగ్రీలకు పైబడిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మహబూబాబాబాద్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగింది. ఖమ్మం, ములుగు జిల్లాల్లో వడగాల్పులు వీచాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది మరోవైపు తెలంగాణలో నేడు రేపు పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖం అంచనా వేసింది.
నల్గొండ జిల్లా మాగుడుల పల్లిలో 45.4 డిగ్రీలు, భద్రాద్రి కోత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45.3డిగ్రీలు,ములుగు జిల్లా మంగపేటలో 45.3డిగ్రీలు, భూపాలపల్లి జిల్లా రేగొండలో 45.2డిగ్రీలు, నల్గొండ జిల్లా వెంకటాపురంలో 45.1డిగ్రీలు, నల్గొండ జిల్లా ఎనుముల హాలియాలో 45.1డిగ్రీలు, కట్టంగూరులో 45.1డిగ్రీలు, త్రిపురారం, నాంపల్లిలో 45.1డిగ్రీలు, వరపర్తిలోని పన్‌గల్‌లో 45.1డిగ్రీలు, జగిత్యాల జిల్లా వెల్లటూరులో 45గ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
సోమవారం ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు
శ్రీకాకుళం జిల్లాలో 11 , విజయనగరంలో 22, పార్వతీపురంమన్యంలో 13 , అనకాపల్లి కె.కోటపాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది..
శ్రీకాకుళంలో 15 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 14, కాకినాడ 14, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 1, ఏలూరు 11, కృష్ణా 5, ఎన్టీఆర్ 6, గుంటూరు 6, పల్నాడు 13, బాపట్ల 1, ప్రకాశం 9, తిరుపతి 2, అనంతపురం 2, అన్నమయ్య 1, నెల్లూరు1, సత్యసాయి 7 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆదివారం 68 మండలాల్లో తీవ్రవడగాల్పులు,120 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.