TGPSC HWO Results 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఫలితాలు విడుదల - ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి-tgpsc hostel welfare officer ranking list released at tspsc gov in direct link here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgpsc Hwo Results 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఫలితాలు విడుదల - ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

TGPSC HWO Results 2024 : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ ఫలితాలు విడుదల - ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 21, 2024 06:33 AM IST

రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రాత పరీక్షల ఫలితాలను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్ కీలతో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత నియామకపత్రాలను అందజేస్తారు.

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు

హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్ ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం రాత్రి ఫైనల్ కీలతో పాటు జనరల్ ర్యాంకింగ్ లిస్టులను విడుదల చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి జీఆర్ఎల్ ను పొందవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. 

జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇలా చెక్ చేసుకోండి:

  • హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, వార్డెన్ ఉద్యోగ రాత పరీక్షలు రాసిన అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలోనే Hostel Welfare Officer జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది.
  • ఇక్కడ రెండు వేర్వురు ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ పరీక్ష అయితే రాశారో అక్కడ క్లిక్ చేయాలి.
  • మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్టుతో కూడిన పీడీఎఫ్ ఓపెన్ అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు. 

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు 81,931 మందితో కూడిన జాబితాను టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. వార్డెన్ అండ్ మ్యాట్రన్‌ పోస్టులకు 497 మందితో కూడిన జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు. 

తెలంగాణ రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో (బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్) ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబరు 22న టీఎస్‌పీఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇందుకు సంబంధించిన రాత పరీక్షలు జూన్‌ 24 నుంచి  జూన్ 29 వరకు జరిగాయి. కంప్యూటర్‌ ఆధారిత (CRBT)విధానంలో ఈ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం 2 పేపర్లతో కూడిన పరీక్ష నిర్వహించారు.. మొత్తం 300 మార్కులు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్): 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2 (ఎడ్యుకేషన్/డిప్లొమా స్పెషల్ ఎడ్యుకేషన్-విజువల్, హియరింగ్) ఉంటాయి. 150 ప్రశ్నలు-150 మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, తెలుగులో మాధ్యమాల్లో ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రాథమిక కీలను విడుదల చేసిన తర్వాత అభ్యంతరాలను స్వీకరించారు. తాజాగా ఫైనల్ కీలతో పాటు జీఆర్ఎల్ ను ప్రకటించారు.