TG Govt Employees DA : ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, దీపావళి కానుకగా డీఏ ప్రకటన
TG Govt Employees DA : తెలంగాణ సర్కార్ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించింది. ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించింది. అలాగే 317 జీవోలో స్పౌస్, హెల్త్, మ్యూచువల్ బదిలీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే ఒక డీఏ ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే 317 జీవోలో స్పౌస్, హెల్త్, మ్యూచువల్ బదిలీలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నవంబర్ 30వ తేదీ లోపు రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
శనివారం తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. దీపావళి కానుకగా ఈ నెల 31న ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. పేదవాళ్లలో అతి పేదవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలుకు పైగా ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
నవంబర్ 30లోపు కులగణన పూర్తి
దాదాపు నాలుగు గంటలు పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. సమ్మక్క, సారలమ్మ ట్రైబల్ వర్సిటీకి 211 ఎకరాల భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న కులగణనను నవంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాలని నిర్ణయించిందన్నారు.
మిల్లర్ల నుంచి మిగులు బియ్యం సేకరణపై కేబినెట్ లో చర్చించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బియ్యం సేకరణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. 6 వేలకు పైగా ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. నాగోల్-ఎల్బీనగర్- హయత్ నగర్ వరకు, ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు సేవలు విస్తరిస్తించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు.
పీపీపీ విధానంలో రోడ్ల నిర్మాణం, ఉస్మానియా ఆస్పత్రికి గోషామహల్‌లో స్థలం కేటాయింపు, గచ్చిబౌలి స్టేడియాన్ని స్పోర్ట్స్ వర్సిటీకి వినియోగించాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 8 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొత్త కోర్టులకు సిబ్బంది కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సంబంధిత కథనం