TS TET Hall Tickets: తెలంగాణ టెట్ 2024 హాల్ టిక్కెట్లు విడుదల, డౌన్‌లోడ్ చేయండి ఇలా..
TS TET Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ పరీక్ష హాల్ టిక్కెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. మే 15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్లను జారీ చేస్తున్నారు.
TS TET Hall Tickets: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టిక్కెట్లను నేటి నుంచి జారీ చేసుకోవచ్చు. టెట్ అభ్యర్థులు బుధవారం నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మే 20 నుంచి జూన్ 2 వరకు తెలంగాణలో టెట్ నిర్వహించనున్నారు.
తెలంగాణలో తొలిసారిఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో టెట్ నిర్వహిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈఏడాది టెట్ పరీక్షకు 2.86లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 48,582 మంది సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తులు సమర్పించారు.
తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీతో పూర్తి అవుతాయి. 25,26,27 తేదీల్లో పరీక్షలు కూడా లేవు. మిగతా అన్ని తేదీల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు మే 15వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చాయి. https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు
- టెట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే 'డౌన్లోడ్ Hall Tickets 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ రిజిస్ట్రేషన్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్ అవసరాల రీత్యా భద్రంగా ఉంచుకోవటం మంచిది.
TS TET Schedule :
తెలంగాణ టెట్ పరీక్ష షెడ్యూల్ - 2024
మే 20, 2024 – పేపర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S1)
మే 20, 2024 – పేపర్ 2 - మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S)
మే 21, 2024 – పేపర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S1)
మే 21, 2024 – పేపర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S2)
మే 22, 2024 – పేపర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S1)
మే 22, 2024 – పేపర్ 2 -మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – S2)
మే 24, 2024 – పేపర్ 2 -సోషల్ స్టడీస్(మైనర్ మీడియం)(సెషన్ – S1)
మే 24, 2024 – పేపర్ 2 -సోషల్ స్టడీస్ (సెషన్ – S2)
మే 28 , 2024– పేపర్ 2 -సోషల్ స్టడీస్ (సెషన్ – S1)
మే 28, 2024 – పేపర్ 2 -సోషల్ స్టడీస్ (సెషన్ – S2)
మే 29, 2024 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – S1)
మే 29, 2024 – పేపర్ 2- సోషల్ స్టడీస్ (సెషన్ – S2)
మే 30 , 2024– పేపర్ 1 -(సెషన్ – S1)
మే 30, 2024 – పేపర్ 1- (సెషన్ – S2)
మే 31, 2024 – పేపర్ 1 -(సెషన్ – S1)
మే 31, 2024 – పేపర్ 1 -(సెషన్ – S2)
జూన్ 1 , 2024– పేపర్ 2- మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – S1)
జూన్ 1, 2024 – పేపర్ 1-(మైనర్ మీడియం) (సెషన్ – S2)
జూన్ 2 , 2024– పేపర్ 1 -(సెషన్ – S1)
జూన్ 2 , 2024– పేపర్ 1- (సెషన్ – S2).
ఏప్రిల్ 27వ తేదీన ఖమ్మం - నల్గొండ- వరంగల్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఉంది. చాలా మంది అభ్యర్థులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయంలో ఈసీకి కూడా విజ్ఞప్తులు అందాయి. షెడ్యూల్ కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా… ఏప్రిల్ 27వ తేదీన పరీక్షలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది విద్యాశాఖ.
తెలంగాణలో నిర్వహించబోయే టెట్ పరీక్ష(TS TET Exams 2024) కోసం మొత్తం 2,83,441 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్ 1 కోసం 99,210 మంచి నుంచి అప్లికేషన్లు రాగా… పేపర్-2(TET Paper 2)కు 1,84,231 మంది దరఖాస్తు చేశారు. మరోవైపు తెలంగాణ టెట్(TET)కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం విద్యాశాఖ ఉచితంగా మాక్ టెస్టులు రాసే అవకాశం కల్పించింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఆప్షన్ తీసుకొచ్చింది. https://schooledu.telangana.gov.in/ISMS/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పరీక్షలను రాసుకొవచ్చు.
సంబంధిత కథనం