TS Inter Result 2023 LIVE: తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్ విడుదల.. లింక్స్ ఇవే-telangana intermediate results 2023 live updates direct link at tsbiecgggo ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Inter Result 2023 Live: తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్ విడుదల.. లింక్స్ ఇవే

ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలు విడుదల

TS Inter Result 2023 LIVE: తెలంగాణ ఇంటర్‌ రిజల్ట్స్ విడుదల.. లింక్స్ ఇవే

10:30 AM ISTMay 09, 2023 04:21 PM HT Telugu Desk
  • Share on Facebook
10:30 AM IST

  • TS Inter Results 2023 Live Updates: తెలంగాణ ఇంటర్ ఫలితాల సీడీని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఇప్పుడే విడుదల చేశారు. రిజల్ట్స్ https://telugu.hindustantimes.com/telangana/results ఈ లింక్ క్లిక్ చేసి చూడొచ్చు.

Tue, 09 May 202310:51 AM IST

ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన గురుకుల విద్యార్థులు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటడం పట్ల రాష్ట్ర ఎస్సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. గురుకుల కాలేజీల్లో మొత్తం 92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం గొప్ప గర్వకారణం అన్నారు. ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్‌ కాగా.. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు.

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం(KGBV )77%, ట్రైబల్ 84 %, ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించడమే విద్యారంగం పట్ల తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందన్నారు. ప్రయివేట్ కాలేజీల్లో కన్నా గురుకుల విద్యాసంస్థల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే ఇందుకు నిదర్శనం అన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా విద్యార్థులు ఇంతటి ప్రతిభ కనబరిచేందుకు ప్రోత్సహించిన బోధన సిబ్బందిని అభినందించారు. ఇప్పటికే గురుకుల విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తుండగా.. మరి కొందరు ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందరని గుర్తు చేశారు. ఈ ఫలితాలు చూసి తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివించేందుకు ముందుకు రావాలన్నారు. పదో తరగతి ఫలితాల్లోను మంచి రిజల్ట్స్ వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశా భావం వ్యక్తం చేశారు.

Tue, 09 May 202310:23 AM IST

TS Inter Results live: ఇంటర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ : https://telugu.hindustantimes.com/telangana/results 

Tue, 09 May 202310:23 AM IST

ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా

తెలంగాణ ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో బాలికలదే హవా. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వీరిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్‌లో పాస్‌ కాగా, 68,335 మంది బి గ్రేడ్‌లో పాస్ అయ్యారు. బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.82 శాతం మంది పాస్‌ అయ్యారు.

Tue, 09 May 202307:07 AM IST

రీకౌంటింగ్ దరఖాస్తు ఇలా..

ఇంటర్ విద్యార్థులు తమ మార్కులను రీకౌంటింగ్ చేయించుకునే వెసులుబాటు ఉంది. అలాగే మీరు రాసిన జవాబు పత్రాలకు సంబంధించి స్కాన్ చేసిన ప్రతులను కూడా పొందవచ్చు. స్కాన్డ్ కాపీకి ప్రతి పేపర్‌కు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ కోసం అయితే ప్రతి పేపర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ ప్లస్ స్కాన్‌డ్ కాపీ కోసం ప్రతి పేపర్‌కు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి రుసుము ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చు. పదో తేదీ నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tue, 09 May 202307:02 AM IST

ఫిర్యాదులకు ఈ నెంబర్లలో సంప్రదించండి

ఇంటర్ రిజల్ట్స్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడినట్టయితే విద్యార్థులు 040- 24600110 మరియు 040-24655027 నెంబర్లలో ఫోన్ చేయొచ్చు.

Tue, 09 May 202306:45 AM IST

Ts Inter Results 2023: ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకుని డౌన్ లోడ్ చేసుకోండి. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ : https://telugu.hindustantimes.com/telangana/results 

Tue, 09 May 202306:33 AM IST

Inter Results 2023: హెచ్‌టీ తెలుగులో రిజల్ట్స్

https://telugu.hindustantimes.com/telangana/results ఈ పేజీలో ఇంటర్ రిజల్ట్స్ చూడొచ్చు. ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. జనరల్, ఒకేషనల్ ఇంటర్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Tue, 09 May 202306:18 AM IST

ఇంటర్ సెకండియర్‌లో 65.26 శాతం ఉత్తీర్ణత

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 3,80,920మంది పరీక్షలకు హాజరైతే 2,56,241మంది పాస్ అయ్యారు. సెకండియర్‌లో 65.26 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణులు అయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 49,593 మంది హాజరైతే 23,533మంది పాస్ అయ్యారు. తెలంగాణలో ఎంసెట్ వెయిటేజీ తొలగించినందున ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కావాలని మంత్రి సూచించారు.

Tue, 09 May 202306:17 AM IST

ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత

తెలంగాణలో 4,33,082లక్షల మంది విద్యార్ధులు మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరైతే వారిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. ఫస్టియర్‌లో 63.85 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారు. ఏగ్రేడ్ లో 1.60లక్షల మంది విద్యార్ధులు పాస్‌ అయ్యారు. బి గ్రేడ్‌లో 68,333మంది పాస్ అయ్యారని మంత్రి తెలిపారు. ఫస్టియర్‌లో 2,17,454 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరైతే 1,49,723మంది ఉత్తీర్ణత సాధించారు. 2,15,628 మంది అబ్బాయిలు ఫస్టియర్ పరీక్షలకు హాజరైతే 1,22,405మంది పాస్ అయ్యారు. అబ్బాయిల్లో 56.80శాతం ఉత్తీర్ణత నమోదైంది.

Tue, 09 May 202306:17 AM IST

ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటి స్థానం

ఇంటర్ ఫస్టియర్‌ ఫలితాల్లో మేడ్చల్ జిల్లాకు మొదటి స్థానం, రెండో స్థానం రంగారెడ్డి జిల్లాకు దక్కింది. మూడో స్థానంలో కొమురం భీం జిల్లా నిలిచింది. సెకండియర్‌ ఫలితాలలో ములుగు జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కొమురం భీమ్ జిల్లాకు, మూడో స్థానంలో మేడ్చల్ జిల్లాలు నిలిచాయి. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 4 నుంచి నిర్వహిస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు

Tue, 09 May 202306:16 AM IST

సెకండియర్ లో ములుగు జిల్లా మొదటి స్థానం

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి సిబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు.సెకండియర్‌ ఫలితాలలో ములుగు జిల్లాకు మొదటి స్థానం, ద్వితీయ స్థానం కొమురం భీమ్ జిల్లాకు, మూడో స్థానంలో మేడ్చల్ జిల్లాలు నిలిచాయి. జూన్ నాలుగు నుంచి సప్లిమెంటరీ పరీక్షల్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

Tue, 09 May 202305:47 AM IST

ఇంటర్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మరికాసేప్టలో హెచ్ టీ తెలుగులో లభ్యం కానున్నాయి. telugu.hindustantimes.com అలాగే tsbie.cgg.gov.in అలాగే https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించి IPE ఫస్టియర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్) తెరవండి. మీ హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఇంటర్ రిజల్ట్స్ పొందండి.

Tue, 09 May 202305:41 AM IST

ఇంటర్ రిజల్ట్స్ గ్రేడ్ల వారీగా ఇలా

ఇంటర్ ఫస్టియర్‌లో ఏ గ్రేడ్‌లో 1,60,000 మంది పైచిలుకు విద్యార్థులు పాసయ్యారు. బీ గ్రేడ్ లో 68 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్ లో ఉత్తీర్ణత 67.26 శాతంగా ఉంది.

Tue, 09 May 202305:37 AM IST

TS Inter Results live 2023: మంత్రి ప్రసంగం ప్రారంభం

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభించారు. మరి కొద్ది క్షణాల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్ విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు.

Tue, 09 May 202305:30 AM IST

Results on HT Portal: హెచ్ టీ తెలుగులో ఇంటర్ రిజల్ట్స్ లభ్యం 

ఇంటర్ ఫస్టియర్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ మరికాసేప్టలో హెచ్ టీ తెలుగులో లభ్యం కానున్నాయి. telugu.hindustantimes.com అలాగే tsbie.cgg.gov.in అలాగే https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించి IPE ఫస్టియర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్) తెరవండి. మీ హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఇంటర్ రిజల్ట్స్ పొందండి.

Tue, 09 May 202304:55 AM IST

TS Inter Results 2023: ఇంటర్ రిజల్ట్స్ లభ్యమయ్యే వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్స్ ఇవే

telugu.hindustantimes.com అలాగే tsbie.cgg.gov.in అలాగే https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించి IPE ఫస్టియర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్) తెరవండి. మీ హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఇంటర్ రిజల్ట్స్ పొందండి.

Tue, 09 May 202304:42 AM IST

TS Inter results 2023 live: ఐపీఈ 2023 రిజల్ట్స్‌లో ఏయే వివరాలు లభిస్తాయి

టీఎస్ ఐపీఈ 2023 ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాలు 2023 చెక్ చేసుకున్నప్పుడు విద్యార్థి పేరు, హాల్ టికెట్ నంబర్, జిల్లా, వివిధ సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు, మొత్తం మార్కులు, అర్హత స్థితి, ఇతర వివరాలు చూడొచ్చు.

Tue, 09 May 202304:40 AM IST

TS Results 2023 Live: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్, టైమ్

తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ నేటి ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

Tue, 09 May 202304:08 AM IST

TS Inter Results Live Telugu: 9 లక్షల మంది హాజరు

మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు నిర్వహించిన ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లో మొత్తం 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. నేడు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ జనరల్, ఒకేషనల్ రిజల్ట్స్ విడుదల కానున్నాయి. మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఫలితాలను ఈ ఉదయం 11 గంటలకు ప్రకటిస్తారు.

Tue, 09 May 202303:56 AM IST

TS Inter Results live updates: మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్

TS Inter IPE Results 2023: తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేసేందుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి 11 గంటలకు తెలంగాణ ఇంటర్ బోర్డులో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. పరీక్షల ఉత్తీర్ణత శాతం, జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం, బాలురు, బాలికల వారీగా ఉత్తీర్ణత శాతం వివరిస్తారు. చివరగా వెబ్‌సైట్లు ఆయా ఫలితాలను వెల్లడించేందుకు వీలుగా పాస్‌వర్డ్ ప్రకటిస్తారు.

Tue, 09 May 202303:50 AM IST

TS Inter Results 2023: ఇంటర్ రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి?

TS Inter Results 2023: రిజల్ట్స్ లభ్యమయ్యే వెబ్‌సైట్లు telugu.hindustantimes.com అలాగే  tsbie.cgg.gov.in అలాగే https://tsbie.cgg.gov.in/ వెబ్ సైట్ సందర్శించి IPE ఫస్టియర్ లేదా సెకండియర్ రిజల్ట్స్ లింక్‌ (జనరల్ లేదా ఒకేషనల్) తెరవండి. మీ హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ చేయండి. ఇంటర్ రిజల్ట్స్ పొందండి.

Tue, 09 May 202303:39 AM IST

తెలంగాణ ఇంటర్ ఫలితాలు తెలుసుకోండి ఇలా

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి కానున్నాయి.  ఇంటర్ ఫలితాలను https://telugu.hindustantimes.com/ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంటర్ బోర్డు ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్‌ను  www.tsbie.cgg.gov.in, www.results.cgg.gov.in  వెబ్‌సైట్లలో కూడా అందుబాటులో ఉంచుతోంది.

Tue, 09 May 202312:14 AM IST

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల

గత  మార్చి/ఏప్రిల్‌ నెలల్లో  జరిగిన ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్‌ సోమవారం  ప్రకటించారు. దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు తెలంగాణలో పరీక్షలు రాశారు. విద్యార్ధులు పరీక్షా ఫలితాలను  www.tsbie.cgg.gov.in, www.results.cgg.gov.in అనే ఇంటర్‌బోర్డు వెబ్‌సైట్లతో తెలుసుకోవచ్చు

Mon, 08 May 202301:46 PM IST

రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు, ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. రెగ్యులర్, ఓకేషనల్ ఫలితాలను ఒక్కసారే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు

1) https://tsbie.cgg.gov.in

2) http://results.cag.gov.in

తదుపరి రోజు న్యూస్ పేపర్లలో కూడా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Mon, 08 May 202312:26 PM IST

TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

TS Inter Results 2023: విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్టియర్, సెకెండర్ ఇయర్ (జనరల్, ఒకేషనల్) ఫలితాలను ప్రకటించనున్నారు.

Mon, 08 May 202312:12 PM IST

మరో రెండు మూడు రోజుల్లో పదో తరగతి ఫలితాలు

మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించనుంది. ఒకేషనల్ విద్యకు సంబంధించిన ఫలితాలు కూడా వెలువడుతాయి. ఇక పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు కసరత్తు తుది దశకు చేరుకుంది. గురువారం ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Mon, 08 May 202311:02 AM IST

TS Inter Results 2023: ఇంటర్ రిజల్ట్స్ మంగళవారం ఉదయం 11 గంటలకు

TS Inter Results 2023: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ ఖరారైంది. మే 9, 2023 మంగళవారం ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. tsbie.cgg.gov.in, results.cgg.gov.in. వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. లైవ్ అప్డేట్స్ కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి…

Mon, 08 May 202310:39 AM IST

TS Inter Results 2023 Date: 9 లక్షల మంది హాజరు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు.

Mon, 08 May 202310:36 AM IST

TS Inter Results 2023 Date: ఇంటర్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం

TS Inter Results 2023 Date: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు కసరత్తు పూర్తిచేసింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను ప్రకటించనున్నట్టు సమాచారం.

Mon, 08 May 202307:50 AM IST

ఇంటర్ మార్కులకు ఎంసెట్‌‌లో వెయిటేజీ లేదు. 

ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించే విధానాన్ని రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు.

Mon, 08 May 202307:04 AM IST

ఇంటర్ ఫలితాలపై విద్యార్ధుల్లో ఉత్కంఠ

ఇంటర్ పరీక్ష ఫలితాల కోసం తెలంగాణ విద్యార్ధులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే ఆలస్యం కావడంతో విద్యార్ధులతో పాటు వారి తల్లిదండ్రులు కూాడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Mon, 08 May 202305:58 AM IST

ఇంటర్ ఫలితాలు తెలుసుకోండి ఇలా

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు ఇంటర్ బోర్డు వెబ్ సైట్   tsbie.cgg.gov.in లేదా results.cgg.gov.in లేదా examresults.ts.nic.in సైట్‌ల నుంచి తెలుసుకోవచ్చు. 

Mon, 08 May 202305:39 AM IST

ఇంటర్ బోర్డుపై పెరుగుతున్న ఒత్తిడి

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలపై బోర్డుపై ఒత్తిడి పెరుగుతోంది.  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే సమయంలో పరీక్షలు జరిగినా ఏపీలో ఫలితాలు విడుదలై వారం గడుస్తోంది.  మరోవైపు తెలంగాణ ఇంటర్ ఫలితాలను వెల్లడించకపోవడానికి కారణాలు ఏమిటనే  సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Mon, 08 May 202305:37 AM IST

పూర్తి స్థాయి అధికారి లేకపోవడమే కారణం

తెలంగాణ ఇంటర్ పరీక్షలకు తెలంగాణలో తొమ్మిదిన్నర లక్షల మంది హాజరయ్యారు. అనుభవం లేని వారికి పరీక్షల నిర్వహణ బాధ్యతలు అప్పగించడమే ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. సోమవారం సాయంత్రంలోగా ఇంటర్ ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

Mon, 08 May 202305:36 AM IST

ఇంటర్ ఫలితాల కోసం ఎదురు చూపు

మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు జరిగిన తెలంగాణ ఇంటర్ ఫలితాలను వెల్లడించడానికి బోర్డు వెనకడుగు వేస్తోంది. ఇంటర్ బోర్డుకు రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడమే ఫలితాల విడుదలలో జాప్యానికి కారణమనే ఆరోపణలు ఉన్నాయి. మరో ఇంటర్ జవాబు పత్రాల మూల్యంకనం రెండు వారాల క్రితమే పూర్తైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

Mon, 08 May 202305:18 AM IST

రేపు విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఏపీ ఇంటర్ ఫలితాలు ఇప్పటికే వెల్లడి కావడంతో తెలంగాణ ఇంటర్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.  రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్దులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

Mon, 08 May 202304:45 AM IST

డైరెక్ట్ లింక్స్ ఇవే

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. విడుదల కాగానే tsbie.cgg.gov.in, results.cgg.gov.in. వెబ్ సైట్లలో రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి.

Mon, 08 May 202304:43 AM IST

ఇంటర్ ఫలితాలపై ఉత్కంఠ

ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి తేదీ, సమయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Mon, 08 May 202304:46 AM IST

రేపు ఇంటర్ ఫలితాలు…?

ఇంటర్ ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు అధికారుల కసరత్తు ముగింపు దశకు చేరుకుంది.

Mon, 08 May 202304:46 AM IST

8 లేదా 10

ఈ నెల 8, 9 10 తేదీల్లో ఇంటర్‌ ఫలితాలు విడుదల చేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఈ నెల 10 లేదా 12వ తేదీల్లో పదో తరగతి ఫలితాలను విడుదల చేసే అవకాశమున్నది. ఫలితాల్లో తప్పుల నివారణ కోసం ఒకటికి రెండుసార్లు వెరిఫికేషన్‌ చేస్తున్నామని, టెక్నికల్‌ ట్రయల్స్‌ను పలుమార్లు నిర్వహిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తికాగానే ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు.

Sat, 06 May 202308:41 AM IST

ఒకేసారి ఫలితాలు… 

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది హాజరయ్యారు. ఫస్ట్, సెకండ్ ఇయర్స్ కి సంబంధించిన ఫలితాలను ఒకే సారి విడుదల చేయనున్నారు.

Sat, 06 May 202308:40 AM IST

మే 2 వారంలోనే….!

తెలంగాణ ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు గత రెండు రోజులుగా వేగం పుంజుకుంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్‌ ప్రక్రియ ను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫా లుగా ట్రయల్‌ రన్‌ చేసినట్లు తెలుస్తోంది. అయితే మే 2 వారంలోగా ఫలితాలు విడులయ్యే అవకాశం ఉందని తాజా సమాచారం తెలుస్తోంది.

Sat, 06 May 202304:28 AM IST

8 లేదా 9..?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు మే 8 లేదా 9 తేదీల్లో విడులయ్యే అవకాశం ఉంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రిజల్ట్స్ ను రిలీజ్  చేయనున్నారు.

Fri, 05 May 202304:02 PM IST

ఫలితాల లింక్స్….

ఫలితాలను tsbie.cgg.gov.in, results.cgg.gov.in. వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Fri, 05 May 202312:27 PM IST

రేపోమాపో క్లారిటీ…!

మే 10వ తేదీలోపు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాల మేరకు తెలుస్తోంది. ఫలితాల విడుదలకు సంబంధించి ప్రాథమికంగా ట్రయల్ రన్ ను కూడా పూర్తి చేసినట్లు సమాచారం. సంబంధిత శాఖ మంత్రి కూడా సమాచారం ఇవ్వగా... అనుమతి రాగానే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మే 8వ తేదీ దాదాపు వచ్చే అవకాశం ఉందని... ఆ తేదీ కుదురకపోతే 9 లేదా 10వ తేదీల్లో ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం. దీనిపై రేపోమాపోఅధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కలిపే ప్రకటించనున్నారు.

Fri, 05 May 202312:27 PM IST

ఏపీ ఫలితాలు విడుదల

ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా ఫలితాలను ఇవ్వాలని చూస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయ్. పరీక్షలు పూర్తి అయిన కేవలం 22 రోజుల్లోనే అక్కడి విద్యాశాఖ రిజల్ట్స్ ను ప్రకటించింది.

Fri, 05 May 202308:24 AM IST

10లోపు ఫలితాలు…?

తెలంగాణ ఇంటర్ ఫలితాలు మే 10వ తేదీలోపు రావొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధమైనట్లు సమాచారం.

Thu, 04 May 202304:55 PM IST

నో వెయిటేజ్…

ఇంటర్‌ మార్కుల ఆధారంగా ర్యాంకులను కేటాయించే విధానాన్ని రాష్ట్ర సర్కారు ఎత్తేసింది. 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్​ మార్కులతో సంబంధం లేకుండా ఎంసెట్ ర్యాంకుల ద్వారానే ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంసెట్‌‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇస్తున్నారు.

Thu, 04 May 202304:54 PM IST

తప్పులు లేకుండా ఫలితాలు… 

ఇంటర్ ఫలితాల విడుదలకు సంబంధించి ఇప్పటికే ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి తప్పులు, సమస్యలకు తావివ్వకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈసారి ఇంటర్‌ పరీక్షల్లో విద్యార్థులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని దిశానిర్దేశం చేశారు.

Thu, 04 May 202302:00 PM IST

8న ఫలితాలు..?

మే 8వ తేదీన ఇంటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ దిశగా అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.

Thu, 04 May 202309:29 AM IST

మే రెండో వారం..?

ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ... అన్ని స్థాయిల్లో పరిశీలించిన తర్వాతే ముందుకువెళ్లాలని అధికారులు నిర్ణయించారు. అయితే అన్నీ కుదిరితే మే రెండో వారంలోపు(మే 8 లేదా 10వ తేదీన) ఇంట‌ర్ ఫ‌లితాల‌ను విడుదల చేయాలని బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

Thu, 04 May 202309:27 AM IST

రిజల్ట్స్ లింక్స్… 

తెలంగాణ ఇంటర్ ఫలితాలను tsbie.cgg.gov.in , results.cgg.gov.in. వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. ఆయా వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ ఆప్షన్ పై నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Thu, 04 May 202309:26 AM IST

ముఖ్య వివరాలు

ఈ ఏడాదికి సంబంధించి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. సెకండియర్ కు సంబంధించి పరీక్షలకు గాను మొత్తం 4,02,630 మంది హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4,82,619 మంది ఉన్నారు. ఇక ఎంసెట్, నీట్, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పనిలో పడ్డారు.

Thu, 04 May 202309:25 AM IST

వాల్యూయేషన్ పూర్తి…

ఎంసెట్ తో పాటు ఇతర పరీక్షల దృష్ట్యా.... వీలైనంత త్వరగా వాల్యూయేషన్ ప్రక్రియ పూర్తి చేశారు.  ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే వచ్చేశాయ్. పరీక్షలు పూర్తి అయిన కేవలం 22 రోజుల్లోనే అక్కడి విద్యాశాఖ రిజల్ట్స్ ను ప్రకటించింది.

Thu, 04 May 202309:25 AM IST

9 లక్షల మంది విద్యార్థులు… 

 తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 9 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు హాజరుకాగా...ఫలితాలను విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే వాల్యూయేషన్  పూర్తి అయింది. 

Thu, 04 May 202309:24 AM IST

ఫలితాలపై కసరత్తు…

తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. మే రెండో వారం నాటికి ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.