September 15 Telugu News Updates: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్-telangana and andhrapradesh telugu live news updates 15 september 2022 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana And Andhrapradesh Telugu Live News Updates 15 September 2022

ఏపీ, తెలంగాణ తాజా వార్తలు

September 15 Telugu News Updates: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

05:10 PM ISTAnand Sai
  • Share on Facebook
05:10 PM IST

  • సెప్టెంబర్ 15 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి

Thu, 15 Sep 202205:08 PM IST

రికార్డు…

ఆధార్‌కు ఓటర్ కార్డు లింక్ చేయడంలో తెలంగాణ సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 75 రోజుల్లోనే కోటి మంది ఓటర్ కార్డులు ఆధార్‌కు లింక్ చేశారు.

Thu, 15 Sep 202205:08 PM IST

జీవీఎల్ ఫైర్

రాజధాని విషయంలో సీఎం జగన్ మూడేళ్ల కిందట వేసిన క్యాసిట్టే వేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఇవాళ ఢిల్లీలో మాట్లాడిన ఆయన.... మూడు రాజధానుల ఏర్పాటు కాదనే విషయం సీఎం జగన్ కు తెలుసని చెప్పారు. విశాఖ అభివృద్ధికి సహకరించకుండా.. రాజధాని చేస్తామంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారని విమర్శించారు.

Thu, 15 Sep 202203:04 PM IST

అమిత్ షా టూర్ షెడ్యూల్ ..

home minister amith sha hyderabad tour:మరోసారి బీజేపీ అగ్రనేత హైదరాబాద్ కు రాబోతున్నారు. రేపు (సెప్టెంబర్ 16) నగరానికి రానున్న ఆయన... సెప్టెంబర్‌ 17న పరేడ్‌ మైదానంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగబోయే హైదరాబాద్‌ విమోచన దినోత్సవంలో పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

Thu, 15 Sep 202201:19 PM IST

సీఎం భేటీ

ఈనెల 19న ఎమ్మెల్యేలతో సీఎం జగన్ భేటీ కానున్నారు.  పీకే టీం ఇచ్చిన సర్వే రిపోర్టుపై చర్చిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అజెండా ఏంటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Thu, 15 Sep 202201:18 PM IST

వర్ష సూచన…

Rains in Telangana:పశ్చిమ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 18న ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ ఆవర్తనం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరాల వెంబడి ఏర్పడుతుందని వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

Thu, 15 Sep 202211:47 AM IST

సీఎం జగన్ ఫైర్..

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడిన జగన్... అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎవరి అభివృద్ధి కోసం ఈ ఉద్యమాలు అని సీఎం జగన్‌ ప్రశ్నించారు.

Thu, 15 Sep 202210:37 AM IST

కోన రఘుపతి రాజీనామా

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి రాజీనామా చేశారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆయన రాజీనామాను ఆమోదించారు. సోమవారం కొత్త డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక జరిగే అవకాశం ఉంది.

Thu, 15 Sep 202210:23 AM IST

టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వికేంద్రీకరణపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడించింది. ఈ క్రమంలోనే సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. సభ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ తమ్మినేనిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరారు. సభ ఆమోదంతో 16 మంది టీడీపీ సభ్యులను ఈరోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు.

Thu, 15 Sep 202210:05 AM IST

సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు

రాష్ట్ర నూతన సచివాలయానికి బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు పెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు ఇచ్చారు.

Thu, 15 Sep 202209:48 AM IST

14 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ

 ఆంధ్రప్రదేశ్ లో 14 మంది ఐఎఫ్ఎస్ అధికారులు బదిలీ అయ్యారు. డీఎఫ్‌వోలు, సబ్‌ డివిజనల్ ఫారెస్టు అధికారులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Thu, 15 Sep 202208:44 AM IST

అందుకే తీసుకొచ్చారు - కొడాలి నాని

3 ప్రాంతాల అభివృద్ధి కావాలంటే పరిపాలన వికేంద్రకరణ జరగాలని సీఎం జగన్‌ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని అన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఒక కులానికో, మతానికో వ్యతిరేకంగా వికేంద్రీకరణ చేయడం లేదని స్పష్టం చేశారు. సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

Thu, 15 Sep 202208:33 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

జమ్ముకశ్మీర్​లోని రాజౌరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పూంఛ్​ నుంచి రాజౌరి వైపు వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఆరుగురు మృతి చెందారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Thu, 15 Sep 202208:33 AM IST

అసెంబ్లీలో వాడీవేడీ కామెంట్స్

సభలో మంత్రి మెరుగ నాగర్జున, టీడీపీ సభ్యులు బాల వీరాంజనేయ స్వామి మధ్య వాడి వేడి కామెంట్స్ జరిగాయి. చంద్రబాబు అన్న మాటలను తప్పుదోవ పట్టించేలా బాల వీరాంజనేయస్వామి ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు. దళితుల్లో ఎవ్వరయినా పుట్టాలనుకుంటారా అని చంద్రబాబు అన్నారని పేర్కొన్నారు. దళిత వ్యతిరేఖి చంద్రబాబు అని అన్నారు.

Thu, 15 Sep 202208:33 AM IST

పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ

పరిపాలనా వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ మెుదలైంది. భూమన కరుణాకర రెడ్డి స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు.

Thu, 15 Sep 202207:56 AM IST

ఈ నెల 21 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయించారు. 19 అంశాలను చర్చించేందుకు టీడీపీ ప్రతిపాదించింది. 27 అంశాలపై చర్చించాలని వైసీపీ ప్రతిపాదన చేసింది. ప్రతిపక్షం ఇచ్చిన ఏం అంశంపై చర్చించేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని వైసీపీ చెబుతోంది.

Thu, 15 Sep 202208:33 AM IST

జాబ్స్ ఎక్కడ జగన్, సభలో ప్లకార్డులతో టీడీపీ సభ్యులు

ఉద్యోగాలేవి అని, నిరుద్యోగులకు నగదు ఇచ్చారా, నిరుద్యోగ భృతి ఇవ్వరా అని టీడీపీ సభ్యులు ప్లకార్డులు పట్టుకువచ్చారు. ప్రశ్నోత్తరాలు అనంతరం అవకాశం ఇస్తామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రతిపక్ష సభ్యులు నినాదలు చేశారు.

Thu, 15 Sep 202208:33 AM IST

దేశంలో పెరిగి కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు పెరిగాయి. తాజాగా వరకు 6,422 మందికి కొవిడ్ సోకింది. ఒక్కరోజులో 5,748 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

Thu, 15 Sep 202208:33 AM IST

నాలుగో రోజు బండి సంజయ్ యాత్ర

బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో రోజుకు చేరుకుంది. ఇవాళ బాలానగర్ గ్రామం నుంచి ప్రారంభమవుతుంది యాత్ర. ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బోయిన్ పల్లి క్రాస్ రోడ్, న్యూ బోయిన్పల్లి, నూతున్ కాలనీ, సరోజినీ పుల్లారెడ్డి హౌస్, స్పెన్సర్ సూపర్ మార్కెట్, బాపూజీ నగర్, అశోక్ గార్డెన్స్, తాడ్ బండ్ హనుమాన్ మందిర్, సిఖ్ విలేజ్ క్రాస్ రోడ్, గన్ రాక్ ఎన్క్లేవ్, వాసవి కాలనీ, గృహ లక్ష్మీ కాలనీ, పికెట్ అంబేద్కర్ క్రాస్ రోడ్ మీదుగా కంటోన్మెంట్ గ్రౌండ్, పికెట్ వరకు కొనసాగుతుంది.

Thu, 15 Sep 202208:33 AM IST

టీడీపీ వాయిదా తీర్మానం

జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ప్రభుత్వం జాబ్ లెస్ క్యాలెండర్‍గా మారిందని టీడీపీ వాయిదా తీర్మానం. ప్రతి ఏడాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు. రాకపోవడంతో ప్రైవేట్ రంగంలోనూ యువతకు నిరాశే మిగిలిందన్న టీడీపీ.

Thu, 15 Sep 202208:33 AM IST

కాకినాడలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

కాకినాడ జిల్లా తుని మండలం వెలమ కొత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని.. బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించారు. 10 మంది వరకు గాయపడినట్టుగా తెలుస్తోంది.

Thu, 15 Sep 202208:33 AM IST

అసెంబ్లీ రద్దు చేస్తారా?

అసెంబ్లీ సమావేశాల్లో.. 15 అంశాలు లేవనెత్తాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. రాజధాని విషయంలో అసెంబ్లీ రద్దు చేస్తారా? అనే సవాల్ విసరాలని టీడీఎల్పీ అనుకుంటోంది. మూడు రాజధానుల అంశాన్ని రెఫరెండంగా తీసుకుని జగన్ ఎన్నికలకు వెళ్లాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Thu, 15 Sep 202208:33 AM IST

చెన్నమనేని పౌరసత్వంపై తీర్పు వాయిదా

కేంద్ర ప్రభుత్వం తన పౌరస త్వాన్ని రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా హైకోర్టు విచారణ చేసింది. ప్రయాణానికి పాత పాస్‌పోర్టు ఉపయోగించినంత మాత్రాన రమేశ్‌ తమ దేశ పౌరుడు అనలేమని లిఖితపూ ర్వంగా జర్మనీ రాయబార కార్యాలయం చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును వాయిదా వేసింది.