Somvati Amavasya 2023 : గంగా నదిలో స్నానం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు
Somvati Amavasya 2023 : ఫాల్గుణ మాసం అమావాస్య.. ఈ రోజున ప్రజలు తమ పూర్వీకుల కోసం ప్రత్యేక ధూపం-ధ్యానం చేస్తారు. ప్రాచీన గ్రంథాలలో ఈ రోజును పండుగగా పేర్కొంటారు.
హిందూ విశ్వాసాల ప్రకారం సోమవతి అమవాస్య రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. అమావాస్య సోమవారం నాడు వచ్చినప్పుడు, దానిని సోమవతి అమావాస్య అంటారు. ఈ సంవత్సరం సోమవతి అమావాస్య ఫిబ్రవరి 20న వచ్చింది. హిందూమతంలో ఈ రోజుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
సోమవతి అమావాస్య రోజున చాలా మంది భక్తులు శివుడిని ప్రార్థిస్తారు. అంతేకాకుండా, చాలా మంది ఈ రోజున విష్ణువు మరియు లక్ష్మీ దేవిని కూడా పూజిస్తారు. హిందూ విశ్వాసాల ప్రకారం, ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం ద్వారా, పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.
సోమవతి అమావాస్య శుభ మహురత్ :
ఫాల్గుణ, కృష్ణ అమావాస్య ప్రారంభ సమయం - ఫిబ్రవరి 19, సాయంత్రం 4:18
ఫాల్గుణ, కృష్ణ అమావాస్య ముగిసే సమయం- ఫిబ్రవరి 20, మధ్యాహ్నం 12:35
సోమవతి అమావాస్య ఆచారాలు
ఈ రోజున భక్తులు తెల్లవారుజామున నిద్రలేచి సరస్సు లేదా నదిలో స్నానాలు చేస్తారు. ఇది సాధ్యం కాకపోతే, స్నానం చేసే నీటిలో గంగాజల్ కలపాలి. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. హిందూ పురాణాల ప్రకారం, స్నానం చేసిన తర్వాత ఆలయంలో దీపం వెలిగించి, విష్ణువు, శివుడికి ప్రార్థనలు చేయాలి.
భక్తులు కూడా ఈ రోజున వీలైనంత ఎక్కువగా మత గ్రంధాలను పఠిస్తూ ధ్యానం చేయాలి. నైవేద్యాలు, విరాళాలు కూడా చేయాలి. వివాహిత స్త్రీలు ఈ రోజున ఉపవాసం పాటించవచ్చు. హిందూ ఆచారాల ప్రకారం, వారి భర్తల ఆరోగ్యవంతమైన, దీర్ఘాయువు కోసం మర్రి చెట్టుకు ప్రార్థనలు చేయవచ్చు.
ఈ రోజున ప్రజలు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. ఈ పవిత్రమైన రోజున ఎవరైనా పవిత్ర స్నానం చేస్తే వారి జీవితంలో పుష్కలమైన ఆశీర్వాదాలు, సానుకూల ఫలితాలు లభిస్తాయని పురణాలు చెబుతున్నాయి. ఒకవేళ సోమవతి అమావాస్య రోజున తీర్థయాత్రలకు వెళ్లలేని పక్షంలో, ఎవరైనా పవిత్ర నదుల్లోని కొన్ని చుక్కల నీటిని తీసుకుని ఇంట్లో స్నానపు నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. దీని తరువాత రావి చెట్టులో నీరు సమర్పించి, విష్ణువుతో పాటు తులసి పూజ చేయాలి.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, దొరికిన సమాచారంపై ఆధారపడి ఇచ్చాం.