Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారిన భర్త, సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య!-siddipet crime news in telugu wife gave supari to kill transgender husband ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారిన భర్త, సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య!

Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారిన భర్త, సుపారీ ఇచ్చి హత్య చేయించిన భార్య!

HT Telugu Desk HT Telugu
Jan 07, 2024 04:03 PM IST

Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్నాడని, సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది ఓ మహిళ. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ట్రాన్స్ జెండర్ గా మారిన వెంకటేశ్
ట్రాన్స్ జెండర్ గా మారిన వెంకటేశ్

Siddipet Crime : ట్రాన్స్ జెండర్ గా మారి వేధిస్తున్న భర్తను భార్య సుపారీ ఇచ్చి హత్య చేయించిన ఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. సిద్ధిపేట పట్టణంలోని బోయిగల్లి కాలనీకి చెందిన వేదశ్రీకి, నాసర్ పురకి చెందిన దరిపల్లీ వెంకటేష్ కి 2014లో వివాహం జరిగింది. వీరికి 2015లో ఒక పాప పుట్టింది. తర్వాత వెంకటేష్ అదనపు కట్నం తీసుకురమ్మని భార్యని వేధించసాగాడు. ఈ క్రమంలో వెంకటేష్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆ తర్వాత వెంకటేష్ ట్రాన్స్ జెండర్ గా మారి రోజాగా పేరు మార్చుకున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు కొన్ని ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. వేదశ్రీ ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసుకుంటూ కుమార్తెను చూసుకుంటుంది. వెంకటేష్ (రోజా) కుమార్తెను తనకు ఇవ్వాలని వేదశ్రీని వేధింపులకు గురి చేసేవాడు. చీర కట్టుకుని తిరుగుతూ తాను ఎక్కడ పనిచేస్తే అక్కడికి వెళ్లి చప్పట్లు కొడుతూ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో తన ఉద్యోగాలను పోగొడుతున్నాడని, తన పరువు తీస్తున్నాడని కోపంతో అతడి అడ్డు ఎలాగైనా తొలగించుకోవాలని అనుకుంది. ఈ క్రమంలో వేదశ్రీ కొంతకాలంగా పట్టణానికి చెందిన బోయిని రమేష్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. అతనితో కలిసి రోజాగా మారిన వెంకటేష్ ను చంపాలని ప్లాన్ వేసింది.

హత్య చేయడానికి రూ.18 లక్షలకు ఒప్పందం

వెంకటేష్ మర్డర్ కు సిద్దిపేటకు చెందిన కాకతీయ ఫుట్వేర్ షాప్ ఓనర్ రమేష్ తో రూ.18 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుంది. రెండు విడతల్లో అతనికి రూ. 4.60 లక్షలు ఇచ్చారు. ప్లాన్ ప్రకారం డిసెంబర్ 11న నంగునూరు మండలం నాగరాజుపల్లి గ్రామానికి చెందిన ఇప్పల శేఖర్ సహాయంతో వెంకటేష్ అలియాస్ రోజాకు బీర్ తాగించి, నిద్రపోయిన తర్వాత రాత్రి సమయంలో మరో ఇద్దరు వ్యక్తుల సహాయంతో వెంకటేష్ ను దిండుతో నొక్కి ఉపిరాడకుండా చేసి హతమార్చారు. అప్పట్లో వెంకటేష్ కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో వెంకటేష్ భార్య వేదశ్రీతో పాటు ఐదుగురి పాత్ర ఉందని తేల్చారు. తన భర్త వెంకటేష్ హత్య కు సుఫారి ఇచ్చినటువంటి వేదశ్రీని, అందుకు సహకరించిన బోయిని రమేష్, హత్య కు సహకరించిన ఇప్పల శేఖర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

Whats_app_banner