Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ-siddipet cp anuradha warned motorists using double silencer case also filed ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

HT Telugu Desk HT Telugu
Apr 28, 2024 10:07 PM IST

Siddipet News : డబుల్ సైలెన్సర్లు, సైరన్ లు, ట్రిపుల్ రైడింగ్ తో ఇతర వాహనదాలకు ఇబ్బందులకు గురి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిద్దిపేటీ సీపీ తెలిపారు. అలాంటి వాహనాలు సీజ్ చేసి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్
డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్

Siddipet News : త్రిపుల్ రైడింగ్(Triple raiding), మైనర్ డ్రైవింగ్, వాహనాలకు సైరన్ (siren)లు, డబుల్ సైలెన్సర్లను అమర్చితే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. జిల్లాలో మైనర్ డ్రైవింగ్, త్రిపుల్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ లు, అధిక శబ్దాలు వచ్చేలా వాహనాలకు సైలెన్సర్లు బిగించే వాహనాలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని, పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత నెల రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగించిన 10 వాహనలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశామన్నారు. త్రిపుల్ రైడింగ్ చేసే వారిపై 250 మందికి జరిమానా విధించి కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది. మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై 50 కేసులు నమోదు, వాహనాలకు డబుల్ సైలెన్సర్లు బిగించి శబ్ద కాలుష్యానికి కారణం అవుతున్న 10 వాహనాలను సీజ్(Vehicle Seize) చేసి జరిమానా విధించామన్నారు.

సైలెన్సర్ తీసి శబ్దకాలుష్యం చేస్తే వాహనం సీజ్

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.... ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules), రోడ్డు నిబంధనలు తెలియని మైనర్లకు వాహనాలు ఇచ్చి వారిని ప్రోత్సహించడం వల్ల తెలిసి తెలియని డ్రైవింగ్ చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో స్పెషల్ డ్రైవ్ లు(Special Drives) నిర్వహించి పట్టుబడిన వారి తల్లిదండ్రులు, వాహనాల యజమానులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలకు సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు బిగించిన 10 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేశామన్నారు. సైరాన్లు తీసివేయించి చట్ట ప్రకారం ఉండవలసిన సైలెన్సర్లను బాధితులతోనే అమర్చేలా చేశామన్నారు. జిల్లాలో సైలెన్సర్(Silencer) లను తీసివేసి శబ్ద కాలుష్యం చేసే వాహనాలపై ,అధిక వేగంతో త్రిపుల్ రైడింగ్(Triple Raiding) చేస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్న వాహనాలను సీజ్ చేయడంతో పాటుగా కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ అనురాధ హెచ్చరించారు.

సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ లు పెడితే కఠిన చర్యలు

పార్లమెంట్ ఎన్నికల(Lok sabha Elections) నిర్వహణ సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ఎన్నికల నియమావళిని(Election Code) జిల్లా యంత్రాంగం పటిష్టంగా అమలు చేస్తుందని కమిషనర్ అనురాధ తెలిపారు. సోషల్ మీడియా(Social Media) సైట్ల పై ప్రత్యేక నిఘా ఉంచామని ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందుని, పౌరులు బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, పోలీసు శాఖ అధ్వర్యంలో సోషల్ మీడియా మానిటరింగ్ సెంటర్ లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఎవరైనా ఇతర వ్యక్తులను, రాజకీయ పార్టీలను ఉద్దేశించి సోషల్ మీడియా అయిన వాట్సప్, ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మొదలగు వాటిలో అనుచితమైన వాఖ్యలు, అనుచిత పోస్టింగ్ (Objectionable Postings)లు పెడితే అలాంటి వారి ఎలక్ట్రానిక్ డివైజ్ లు సీజ్ చేసి వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

Whats_app_banner