Army School Recruitment: సికింద్రాబాద్‌ రామకృష్ణాపురం ఆర్మీ స్కూల్లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు-secunderabad ramakrishnapuram army school non teaching jobs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Army School Recruitment: సికింద్రాబాద్‌ రామకృష్ణాపురం ఆర్మీ స్కూల్లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు

Army School Recruitment: సికింద్రాబాద్‌ రామకృష్ణాపురం ఆర్మీ స్కూల్లో నాన్‌ టీచింగ్ ఉద్యోగాలు

Sarath chandra.B HT Telugu
Mar 04, 2024 11:55 AM IST

Army School Recruitment: ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
సికింద్రాబాద్ ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు

Army School Recruitment: సికింద్రాబాద్‌ రామకృష్ణాపురం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్లో APSRK Puram14 నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో సాగుతున్న ఆర్మీ పబ్లిక్ స్కూల్‌ హైదరాబాద్‌ ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటిగా ఉంది.

yearly horoscope entry point

భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు 1, అడ్మినిస్ట్రేటివ్ సూపర్ వైజర్ పోస్టులు 2, అకౌంట్స్‌ క్లర్క్ ఫర్ ప్రీ ప్రైమరీ వింగ్ లోయర్ డివిజన్ క్లర్క్‌ పోస్టు 1, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్లు 1, బయో ల్యాబ్ అటెండెంట్లు 1, లైబ్రేరియన్ 1, అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు 1, ప్రొక్టోరియల్ కమిటీ మెంబర్ పోస్టులు2, పారామెడికల్ సిబ్బంది 1, డ్రైవర్లు రెండు ఉద్యోగాలను భర్తీ చేస్తారు. మొత్తం 14 ఉద్యోగాలను నాన్ టీచింగ్ పోస్టుల్లో నియమిస్తారు.

ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలను పేర్కొన్నారు. లైబ్రేరియన్ పోస్టులకు లైబ్రరీ సైన్స్ డిగ్రీ పారామెడికల్ ఉద్యోగాలకు నర్సింగ్ డిప్లొమా అర్హతలు తప్పనిసరిగా పేర్కొన్నారు. మిగిలిన ఉద్యోగాలకు కనీసం విద్యార్హత 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉండాలి. పూర్తి స్థాయి నోటిఫికేషన్ ఆర్మీ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

ఉద్యోగాలకు రూ.18వేల నుంచి 38వేల పే స్కేల్ మధ్య వేతనం చెల్లిస్తారు. గరిష్ట వయో పరిమితి 35ఏళ్లుగా నిర్ణయించారు.

దరఖాస్తుదారులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 15వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు htttps://apsrkpuram.edu.inలో లభిస్తాయి.

Whats_app_banner