Robbery in Hyderabad : హైదరాబాద్ లో పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ... కీలకంగా మారిన సీసీ పుటేజీ
Jewellery Shop Robbery in Hyderabad : హైదరాబాద్ లో పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ జరిగింది. మలక్‌పేట - అక్బర్ భాగ్ ప్రాంతంలోని కిశ్వా జువెలరీ షాప్‌లో ఈ ఘటన జరిగింది. యజమాని కుమారుడిపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Robbery in Jewellery Shop: హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ఛాదర్ ఘాట్ ప్రాంతంలోని ఓ జ్యువెలరీ దుకాణంలో బుధవారం పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు......కత్తులతో షాప్ యజమాని కుమారుడు పై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకుపోయారు. కస్టమర్ గా వచ్చిన మరో వ్యక్తి వీరికి సహకరించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న చాధర్ ఘాట్ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగిందని, వివిధ ప్రాంతాల్లో ఉన్న సిసి కెమెరాల్లో రికార్డ్ అయిన ఫీడ్ ఆధారంగా ముందుకు వెళుతున్నట్లు ఇన్స్పెక్టర్ ప్రకాష్ రెడ్డి తెలిపారు.
అసలేం జరిగిందంటే.....
హైదరాబాద్ నగరానికి చెందిన మొహమ్మద్ ఉల్ర హమాన్ చాదర్ ఘాట్ లోని అక్బర్ చౌరస్తాలో కిస్వా జ్యువెలర్స్ పేరుతో వెండి, బంగారం నగల విక్రం దుకాణం నిర్వహిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం ఉల్ రెహమాన్ కుమారుడు సాజవుర్ రెహమాన్ దుకాణంలో ఉన్నాడు.మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దుకాణానికి వచ్చిన ఓ యువకుడు తనకు వెండి గొలుసు కావాలని రెహమాన్ ను అడిగాడు.దీంతో అతను గొలుసులు చూపిస్తున్నడు.ఈ క్రమంలోనే ముఖానికి మస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు.......నెంబర్ ప్లేట్ లేని ఓ ద్విచక్ర వాహనంపై వచ్చి దుకాణం వద్ద ఆగారు. మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో ఒక్కసారే దుకాణం లోపలకి ప్రవేశించి తమ వద్ద ఉన్న కత్తులు బయటకు తీశారు. వెండి గొలుసులు పరిశీలిస్తున్న కస్టమర్ ను పక్కకు తోసేసి సజావురుపై కత్తితో దాడికి యత్నించారు. దుండగులను అడ్డుకునే క్రమంలో ఆయన ఎడమచేవి ,ఎడమ చేయికి తీవ్రంగా గాయాలయ్యాయి.దాంతో సజావుర్ కింద పడిపోయాడు.అప్పటికే తమ వెంట తెచ్చుకున్న సంచి లో బంగారు ఆభరణాలు సంచి లో వేసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న చాదర్ ఘాట్ పోలీసులు.......ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా..... ఇద్దరు దుండగులు పాతబస్తీ వైపు నుంచి కమటిపుర ఫ్లైఓవర్ మీదుగా చాధార్ ఘాట్ వచ్చి దోపిడీ చేసి మళ్ళీ అదే మార్గంలో తిరిగి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దుండగులు దుకాణంలో చొరబడడానికి ముందు వినియోగదారుడుగా వచ్చిన యువకుడు కూడా ఈ ముఠాలో భాగమే అయి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దోపిడి దొంగలు ఆ యువకుడి జోలికి వెళ్ళికపోవడం....దుండగులు దాడి చేస్తూ దోపిడీ చేస్తుంటే యువకుడు అడ్డుకొకపోవడంతో అతను కూడా ఈ ముఠాలో భాగమే అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.అయితే దోపిడీ తరువాత దుకాణం వద్ద నుంచి కొద్దిదూరం నడిచి వెళ్ళన ఆ యువకుడు..... అక్బర్ బాబు చౌరస్తా సమీపంలో ఆటో ఎక్కి మలక్పేట డి మార్ట్ వద్ద దిగాడు. మళ్ళీ అక్కడి నుంచి మరో ఆటో ఎక్కి మీర్ చౌక్ వెళ్ళాడు.ఆపై ఆ యువకుడి ఆచూకీ లభించలేదు.దీంతో పోలీసుల అనుమానాలకు ఇది మరింత బలం చేకూర్చినట్లు అయింది
ఘటనా స్థలానికి వచ్చిన సౌత్ ఈస్ట్డి సిపి జానకి ధరావత్ మలక్ పేట్ ఏసీబీ శ్యాంసుందర్ వివరాలు తెలుసుకున్నారు.ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాజావుర్ పరిస్థితి నిలకడగా ఉందని...... దోపిడి దొంగలను పట్టుకోడానికి ప్రత్యేక బృందం గాలిస్తుందని...... దోపిడీకి గురైన బంగారం విలువ పోలీసులు రికార్డుల ప్రకారం రూ.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.