Revanth Reddy | వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు.. కొల్లాపూర్‌లో రేవంత్ రెడ్డి పూర్తి ప్రసంగం ఇదే..-revanth reddy comments on cm kcr in kollapur mana ooru mana poru ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy | వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు.. కొల్లాపూర్‌లో రేవంత్ రెడ్డి పూర్తి ప్రసంగం ఇదే..

Revanth Reddy | వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు.. కొల్లాపూర్‌లో రేవంత్ రెడ్డి పూర్తి ప్రసంగం ఇదే..

HT Telugu Desk HT Telugu
Mar 13, 2022 09:55 PM IST

నాగర్​కర్నూల్​ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెస్ పార్టీ.. మన ఊరు-మన పోరు.. సభను నిర్వహించింది. ఈ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

<p>కొల్లాపూర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి</p>
కొల్లాపూర్ సభలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో మన ఊరు-మన పోరు సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డిసెంబర్​లో కేసీఆర్​ ప్రభుత్వం రద్దవుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే మార్చికల్లా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నట్టు తెలిపారు. అప్పుడు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. పాలమూరును సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారంటే..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లాంటి సమస్యను పరిష్కరించిన కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మాదిగ బిడ్డల కోసం వర్గీకరణ సమస్యను కూడా పరిష్కారం చేస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ గెలిపించండి. వర్గీకరణ ఎలా కాదో చేసి చూపిస్తాం. మోడీ మెడలు వంచి మాదిగ బిడ్డల కోసం వర్గీకరణ చేయిస్తాని కేసీఆర్ చెప్పి ఓట్లు వేయించుకున్నాడు . ఇప్పుడు నమ్మక్కాన్ని వమ్ము చేశాడు.

ఈ మధ్య ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు మెుదలు పెట్టాడు. ఉన్న పళంగా కేసీఆర్ దవాఖానాకు పోతున్నాడు. మంచంపై పడుకుంటున్నాడు. ఆ ఫోటోలు, విజువల్స్, మీడియాకు ఇచ్చి హడావుడి చేయిస్తున్నారు. సీఎం ఆరోగ్యం బాగాలేదు కావచ్చు.. కానీ ఇన్ని డ్రామాలు అవసరమా? 12 నెలలు కష్ట పడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. డిసెంబర్ లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేస్తాడు. మార్చిలో ఎన్నికల వస్తాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తుంది. మహిళలకు మంత్రి వర్గంలో నలుగురికి చోటు కల్పిస్తాం. పాలమూరు-రంగారెడ్డి, బీమా, నెట్టెంపాడు, జూరాలా.. ఇతర పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.

కొల్లాపూర్లో నాయకులు మోసం చేసినా.. కార్యకర్తలు జెండాలు పట్టుకుని సభను విజయవంతం చేశారు. కృష్ణ నదికి వరదొచ్చి కొల్లాపూర్లో ప్రవహిస్తోందా అన్నట్టు తరలివచ్చారు. 33 జిల్లాలు, 119 నియోజగవర్గాల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగి జెండా ఎగరేస్తా. కొల్లాపూర్ ప్రాంత రైతులు త్యాగం చేస్తే.. శ్రీశైలం ప్రాజెక్టు వచ్చింది. కానీ ముంపు బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగేలదు. కేసీఆర్ సీఎం అయ్యాక కూడా పట్టించుకోలేదు.

ఈసారి కొల్లాపూర్ కాంగ్రెస్ గెలుపు.. ఇక్కడ ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేను నల్లమల బిడ్డను.. ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగా. మధ్య తరగతి రైతు బిడ్డను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడినయ్యాను. దణ్ణం పెట్టి అడుగుతున్నా.. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మీ బిడ్డకు అవకాశం వచ్చింది. మీ బిడ్డ సంతకం పెడితే.. 119 మందికి బీఫారాలు ఇచ్చే అవకాశం వచ్చింది. ఈ అవకాశం వృథా కాకూడదు.

Whats_app_banner