Kamareddy Hospital | ఆసుపత్రిలోకి మళ్లీ ఎలుకలొచ్చాయి.. ఐసీయూలో ఎలుకల బోను-rats in kamareddy govt hospital ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kamareddy Hospital | ఆసుపత్రిలోకి మళ్లీ ఎలుకలొచ్చాయి.. ఐసీయూలో ఎలుకల బోను

Kamareddy Hospital | ఆసుపత్రిలోకి మళ్లీ ఎలుకలొచ్చాయి.. ఐసీయూలో ఎలుకల బోను

HT Telugu Desk HT Telugu
Apr 17, 2022 10:19 AM IST

ఇటీవలే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి.. ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఆసుపత్రిలోకి ఎలుకలు వచ్చి ఓ రోగిని కొరికాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయింది. అయితే ఈ ఘటన మరవకముందే.. కామారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రిలోనూ.. ఎలుకల భయ పట్టుకుంది. ఏకంగా ఐసీయూలోకే ఎలుకలు వస్తున్నాయి.

ఆసుపత్రిలో ఎలుకల బోను
ఆసుపత్రిలో ఎలుకల బోను

ఇప్పుడు ఆసుపత్రుల్లో ఎలుకల భయం పట్టుకుంది. ఇటీవలే.. వరంగల్ ఎంజీఎంలో ఓ వ్యక్తిని ఎలుక కొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అతను చనిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్ అయి.. కఠిన చర్యలు తీసుకుంది. అయితే తాజాగా కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోనూ.. ఎలుకలు సంచరిస్తున్నాయి. దీనికోసం ఐసీయూలో ఎలుకల బోన్లు, ర్యాట్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం చూసి రోగులు భయపడుతున్నారు.

కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలోని ఐసీయూ, ట్రామాకెర్ విభాగంలో ఎలుకలు సంచరిస్తున్నాయి. బెడ్స్‌పై పడుకుని ఉన్న రోగులపై వెళ్తున్నాయని.. బాధితులు చెబుతున్నారు. ఎలుకల సంచారంతో ఆసుపత్రిలో పారిశుద్ద్య నిర్వహణ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. ఎలుకలు వస్తున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పడుకున్న వారిపై నుంచి వెళ్తున్నాయని రోగులు చెబుతున్నారు. కామారెడ్డి ఆసుపత్రికి రోజు వందల సంఖ్యలో పేషెంట్లు వస్తుంటారు. ఈ ఎలుకల బెడదతో భయపడిపోతున్నారు.

అయితే వాటిని పట్టుకునేందుకు ఐసీయూల్లో ఎలుకల బోన్లు, ర్యాట్ ప్యాడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. మరో విషయం ఏంటంటే.. పేషెంట్ల పక్కనే వాటిని పెట్టారు. ఏసీలు ఏర్పాటు చేసిన సమయంలో హోల్స్ చేశారని.., వాటి ద్వారా ఎలుకలు వస్తున్నాయని అధికారులు చెప్పారు. వార్డుల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఏసీ రంద్రాలు అన్ని మూసివేశామని తెలిపారు. ట్రామాకేర్ విభాగంలో పేషెంట్‌ బంధువులు ఆహ‌రప‌దార్థాలు తీసుకువ‌స్తారని.. ఈ కారణంగానే.. ఎలుకలు వస్తున్నాయని చెబుతున్నారు. రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారుు.

IPL_Entry_Point