TS Rajiv Arogyasri Scheme : తెలంగాణలో 'రాజీవ్ ఆరోగ్య శ్రీ' స్కీమ్ - కొత్తగా వచ్చిన మార్పులెంటో చూడండి
Telangana Rajiv Arogyasri scheme : తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ ను అమల్లోకి తీసుకొచ్చింది. గతానికి భిన్నంగా కీలకమైన మార్పులు చేసింది. అవెంటో ఇక్కడ చూడండి...
Rajiv Arogyasri scheme in Telangana : తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్... హామీల అమలుపై దృష్టిపెట్టింది. ప్రభుత్వంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే... ఎన్నికల హామీలో ప్రకటించిన ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్ ను పట్టాలెక్కింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...ఈ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన హైదరాబాద్ లో ప్రారంభించారు. అయితే గతంలోనే ఉన్న ఆరోగ్య శ్రీ స్కీమ్ కు... ప్రస్తుతం అమలవుతున్న స్కీమ్ కు తేడాలు ఉన్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం....
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం:
- కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అందులో ఒకటి చేయూత. దీనిలోని అంశమే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్.
- బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం లక్ష్యం.
- తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- గతంలో రూ. 5 లక్షల వరకే ఆరోగ్య బీమా ఉండగా... ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది.
- ఈ స్కీమ్ లో భాగంగా 1672 వైద్య సేవలు కవర్ అవుతాయి.
-రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఇది అమలవుతుంది.
- ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి.
-ఆరోగ్య శ్రీ పథకాన్ని వైఎస్ హయాంలో తీసుకొచ్చారు.
-ఇప్పటి వరకు ఐదు లక్షల పరిమితితో ఈ స్కీమ్ కొనసాగింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్… రూ. 10 లక్షల వరకు పరిమితిని పెంచింది.