Rahul Bharat Jodo : రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ, ప్రశాంత్ భూషణ్-rahul gandhi bharat jodo yatra continues in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Rahul Gandhi Bharat Jodo Yatra Continues In Telangana

Rahul Bharat Jodo : రాహుల్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ, ప్రశాంత్ భూషణ్

HT Telugu Desk HT Telugu
Nov 06, 2022 09:44 AM IST

Rahul Bharat Jodo తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. 11వ రోజు రాహుల్ గాంధీ మెదక్ జిల్లాలో సాగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్నారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం రాంపూర్‌ పెద్దమ్మ గుడి నుంచి రాహుల్ గాంధీ పాదయాత్రను ప్రారంభించారు. ఆదివారం రాహుల్ గాంధీ పాదయాత్రకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో పాటు ప్రశాంత్ భూషణ్ సంఘీభావం తెలిపారు.

మెదక్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
మెదక్‌లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర

Rahul Bharat Jodo రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర 11వ రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. మెదక్‌ జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం ఉదయం మెదక్ జిల్లా, అల్లా దుర్గం మండలం, రాంపూర్ పెద్దమ్మ గుడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లాలోకి రాహుల్‌ గాంధీ ప్రవేశించనున్నారు.

ఆదివారం అల్లాదుర్గం మండలం నుంచి పెద్ద శంకరంరం పేట మండలంలోని చింతల్ లక్ష్మపూర్ వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. చింతల్ లక్ష్మపూర్‌లో రాహుల్ మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తిరిగి నాలుగు గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా దాటి కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం, పెద్దకొడపగల్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే రాహుల్ బసచేస్తారు.

పదకొండవ రోజు అల్లదుర్గ్ నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర చింతల్ లక్ష్మాపూర్, నిజాంపెట్ అండర్ పాస్ మీదుగా మహాదేవపల్లి వరకు సాగనుంది. పెద్ద కొడపగల్‌లో రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు. సోమవారంతో తెలంగాణలో రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనుంది. అక్టోబర్‌ 21న తెలంగాణలో ప్రవేశించిన రాహుల్ గాంధీ పాదయాత్ర మధ్యలో నాలుగు రోజులు విరామం తీసుకున్నారు. రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. రేపటితో తెలంగాణలో ముగియనుండటంతో రాహుల్‌ గాంధీకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు తెలంగాణ పిసిసి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం 4గంటలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. గత 11 రోజులుగా తెలంగాణలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. వివిధ వర్గాల ప్రజలు, యువత, రైతులు, కార్మికులు, నిరుద్యోగులను కలుస్తూ రాహుల్ ముందుకెళుతున్నారు. ప్రజల సమస్యలు వింటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను రాహుల్ ఎండగడుతున్నారు.

రాహుల్ గాంధీ కన్యాకుమారిలో భారత్ జోడో యాత్ర ప్రారంభించారు. గత 59 రోజులుగా భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. ఆదివారం భారత్‌ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి పలువురు మద్దతు తెలిపారు. జోడో యాత్రకు మద్దతుగా రాహుల్ పాదయాత్రలో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. భారత్‌ జోడోలో రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సంఘీభావం తెలిపారు.

IPL_Entry_Point