PIB Hyderabad Jobs 2024 : పీఐబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలివే-pib hyderabad is hiring candidates for telugu translator vacancies 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pib Hyderabad Jobs 2024 : పీఐబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలివే

PIB Hyderabad Jobs 2024 : పీఐబీ హైదరాబాద్ లో ఉద్యోగాలు - ఖాళీల వివరాలివే

PIB Hyderabad Recruitment 2024: పీఐబీ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా… ట్రాన్స్ లేటర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఈ మేరకు ముఖ్య వివరాలను పేర్కొంది.

పీఐబీ హైదరాబాద్ ఉద్యోగాలు 2024 (https://pib.gov.in/)

PIB Hyderabad Recruitment 2024: పీఐబీ(కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలుగు ట్రాన్స్ లేటర్ పోస్టులను రిక్రూట్ చేయనుంది. ఫిబ్రవరి 23వ తేదీని దరఖాస్తులకు తుది గడువుగా ప్రకటించింది. మెయిల్ లేదా గూగుల్ ఫారమ్ ను నింపి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఖాళీల వివరాలను ఇక్కడ చూడండి….

ముఖ్య వివరాలు:

రిక్రూట్ మెంట్ ప్రకటన - పీఐబీ(కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం.

ఉద్యోగాలు - ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్లు, సీనియర్ ట్రాన్స్ లేటర్, సీనియర్ స్పెషలిస్ట్, తెలుగు ల్యాంగ్వేజ్ టైపింగ్

అర్హతలు - డిగ్రీ పూర్తి చేయటంతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.

ఆన్ లైన్ ట్రాన్స్ లేటర్లు ఇంటి వద్ద నుంచే వర్క్ చేయవచ్చు. మిగతా వారు ఆఫీస్ లో పని చేయాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం - దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణ తుది గడువు - ఫిబ్రవరి 23, 2024.

దరఖాస్తుల నింపేందుకు గూగుల్ ఫారమ్ లింక్ : //forms.gle/B6qW4eg198nfqFzN7

మెయిల్: pibhyderabad@gmail.com

ICG Recruitment 2024: నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఇండియన్ కోస్ట్ గార్డ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్ లకు దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 13న ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్ సైట్ joinindiancoastguard.cdac.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 27.

ఇలా అప్లై చేయండి..

అభ్యర్థులు ముందుగా ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక వెబ్ సైట్ joinindiancoastguard.cdac.in ను ఓపెన్ చేయాలి.

హోం పేజీపై కనిపిస్తున్న Join ICG as Enrolled Personnel CGEPT లింక్ పై క్లిక్ చేయండి.

ఆ తరువాత Online Application for CGEPT Registration లింక్ పై క్లిక్ చేయండి.

వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోండి.

అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయండి.

అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.

అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయండి.

అప్లికేషన్ ఫామ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోండి.