Owaisi appeals to ensure peace: శాంతియుతంగా ఉండాలన్న ఒవైసీ
శుక్రవారం ప్రార్థనల సందర్భంగా శాంతియుతంగా ఉండాలని అసుదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్, ఆగస్టు 26: నేడు శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు విన్నవించారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ నాయకుడు టి.రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకొని సస్పెండ్ చేయాలన్న తమ డిమాండ్ నెరవేరిందని అన్నారు.
ప్రవక్త మహమ్మద్‌పై రాజా సింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా గురువారం తెల్లవారుజామున తెలంగాణలో నిరసనలు చెలరేగాయి. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ (పీడీ యాక్ట్) కింద రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకుని చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉంచినట్లు హైదరాబాద్ పోలీసులు గురువారం తెలిపారు.
‘శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశ సామరస్యానికి విఘాతం కలిగించే పనులు చేయవద్దని మీ అందరినీ కోరుతున్నాను..’ అని ఒవైసీ హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో అన్నారు.
‘మా అతిపెద్ద డిమాండ్.. అతడిని అరెస్టు చేయడమే. పీడీ చట్టం కింద అరెస్ట్ చేశారు. రేపు శుక్రవారం ప్రార్థనలు శాంతియుతంగా జరిగేలా చూడాలని నేను అందరినీ కోరుతున్నాను..’ అని ఓవైసీ అన్నారు.
"18 మతపరమైన నేరాలలో ప్రమేయం ఉన్న రాజా సింగ్‌పై 101 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టి.రాజా సింగ్‌ను 1986 యాక్ట్ నెం.1 కింద ఆగస్టు 25న పీడీ యాక్ట్ కింద అదుపులోకి తీసుకున్నాం..’ అని పోలీసులు తెలిపారు.
‘రాజా సింగ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం అలవాటుగా మారింది.. ప్రజా సంఘర్షణకు దారితీసే వర్గాల మధ్య చీలికకు ప్రయత్నించారు..’ అని పోలీసులు తెలిపారు.
యూట్యూబ్‌లో సింగ్ విడుదల చేసిన వీడియోను ప్రస్తావిస్తూ, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత హైదరాబాద్ నగరంలో, తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో నిరసనలు చెలరేగాయని తెలిపారు. “వర్గాల మధ్య చీలిక తెచ్చి తెలంగాణ లో శాంతియుత స్వభావానికి భంగం కలిగించారు.’ అని పోలీసులు తెలిపారు.
‘మహ్మద్ ప్రవక్త, అతని జీవనశైలికి వ్యతిరేకంగా దైవదూషణ చేశారు..’ పోలీసులు తెలిపారు. మంగళవారం అతడిని అదుపులోకి తీసుకోగా, కోర్టు ఆదేశాలతో విడుదలయ్యారు.
రాజా సింగ్‌పై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 153(A), 295, 505 కింద డబీర్‌పురా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.