PFI Case Update : పీఎఫ్ఐ కేసు.. నిందితులను కస్టడీకి కోరిన ఎన్ఐఏ-nia seeks custody of four accused arrested in pfi case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pfi Case Update : పీఎఫ్ఐ కేసు.. నిందితులను కస్టడీకి కోరిన ఎన్ఐఏ

PFI Case Update : పీఎఫ్ఐ కేసు.. నిందితులను కస్టడీకి కోరిన ఎన్ఐఏ

HT Telugu Desk HT Telugu
Sep 20, 2022 07:11 PM IST

NIN Serious Investigation In PFI Case : పీఎఫ్ఐ కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. అయితే నిందితుల్ని తాజాగా కస్టడీకి కోరింది. 30 రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును విజ్ఞప్తి చేసింది.

<p>ఎన్ఐఏ</p>
ఎన్ఐఏ (HT_PRINT)

పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కేసులో ఎన్ఐఏ(NIA) దర్యాప్తు సీరియస్ గా నడుస్తోంది. పీఎఫ్ఐకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయనే కోణంలో ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిని 30 రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును ఎన్ఐఏ కోరింది.

సయ్యద్ సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్,ఇర్ఫాన్‌ను ఎన్‌ఐఏ(NIA) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నలుగురు నిందితులు పీఎఫ్‌ఐ(PFI) కార్యకర్తలని ఎన్ఐఏ కోర్టుకు చెప్పింది. అబ్దుల్‌ ఖాదర్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టారు. ఆదివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 38 చోట్ల సోదాలు నిర్వహించారు.

ఈ దాడుల్లో భాగంగా నలుగురు నిందితులను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఫోన్లు, పాస్ పోర్టులు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, డైరీలు స్వాధీనం చేసుకుంది. వాటిని కోర్టుకు ముందుకు తీసుకొచ్చింది. కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు(Computer Hard Disk), కీలక పత్రాలను సైతం సమర్పించారు.

నిషేధిత సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియాతో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కలిసి పని చేస్తున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పీఎఫ్ఐ ఛైర్మన్ అబ్దుల్ రెహ్మాన్ గతంలో స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియాకి జాతీయ కార్యదర్శిగా కూడా ఉండటంతో అనుమానాలు ఇంకా ఎక్కువ అయ్యాయి. అంతేకాదు.. పీఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న అబ్ధుల్ హమీద్ గతంలో సిమికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నట్టు తెలుస్తోంది. వీటన్నింటీని ఎన్ఐఏ అధికారులు విశ్లేషించారు. పీఎఫ్ఐ, సిమీ(SIMI) సంస్థల మధ్య లింక్స్ పై నిఘా పెట్టారు.

ఎన్ఐఏ తనిఖీల్లో పీఎఫ్ఐ ఆర్థిక లావాదేవీలు, నిధుల సేకరణ వివరాలు, బ్యాంక్ ఖాతాలు, డైరీలు, బుక్స్ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పీఎఫ్ఐతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. సిమి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్టుగా భావిస్తున్న వారి దగ్గర నుంచి హార్డ్ డిస్క్, లాప్ టాప్,ప్లెక్సీ, మారణాయుధాలు, లాఠీలు, నాన్‌చాక్‌లు స్వాధీన పరుచుకున్నారు. అయితే దీనిపై మరింతగా విచారణ చేసేందుకు నిందితులు కస్టడీకి కావాలని కోరింది ఎన్ఐఏ.

Whats_app_banner