Minister Harishrao: గవర్నర్ గారు.. ఓసారి అక్కడ చూసి ఇక్కడ చూడండి-minister harishrao slams governor tamilisai soundararajan comments on health dept ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Minister Harishrao: గవర్నర్ గారు.. ఓసారి అక్కడ చూసి ఇక్కడ చూడండి

Minister Harishrao: గవర్నర్ గారు.. ఓసారి అక్కడ చూసి ఇక్కడ చూడండి

HT Telugu Desk HT Telugu
Sep 09, 2022 03:55 PM IST

minister harishrao on governor comments : రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఒక డాక్టర్ అయ్యుండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసే మాట్లాడడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

మంత్రి హరీశ్ రావ్ (ఫైల్ ఫొటో)
మంత్రి హరీశ్ రావ్ (ఫైల్ ఫొటో) (twitter)

minister harishrao slams governor tamilisai comments: వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. గవర్నర్ కామెంట్స్ చాలా బాధాకరమన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడారు. తాండూరు వేదికగా రాష్ట్రవ్యాప్తంగా ఆశా, ఎఎన్ఎంలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎఎన్ఎం సబ్ సెంటర్లు పల్లె దవాఖానలుగా చేస్తున్నామన్న ఆయన.. 3200 పల్లె దవాఖాన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ లేదా స్టాఫ్ నర్స్ ఇక్కడ ఉండి సేవలు అందిస్తారని చెప్పుకొచ్చారు.

కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ కూడా నడుస్తున్నదనది.. సీఎం కేసీఆర్ త్వరలోనే ఆశా కార్యకర్తలను ప్రగతి భవన్ కి పిలిచి మాట్లాడుతారని తెలిపారు. జీతాలు కూడా పెంచారని గుర్తు చేశారు. 'మధ్యప్రదేశ్ లో ఈరోజు కూడా 3000 మాత్రమే ఇస్తున్నారు. ఛత్తీస్ గడ్ లో 4000 ఇస్తున్నారు. మనం మాత్రం 9750 ఇస్తున్నాం. పని చేస్తే ప్రేమగా చూసుకుంటాం.బాగా పని చేసిన వారికి పిలిచి హైదరాబాద్ లో సన్మానం చేశాం' అని మంత్రి చెప్పారు.

'వికారాబాద్ జిల్లా అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నది. మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఒక్క ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేదు అని నేను ఉద్యమం సమయంలో అడిగాను. తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడు జిల్లాలుగా మారి, డిగ్రీ కాలేజీలు కాదు మూడు మెడికల్ కాలేజీల ఏర్పాటు జరిగింది. మొన్ననే సీఎం కేసీఆర్ రూ. 235 కోట్లతో వికారాబాద్ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. వారం రోజుల్లో 30 కోట్లతో నర్సింగ్ కాలేజీ ప్రారంభిస్తాము. రూ. 15 కోట్లతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రి వికారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నాం' - మంత్రి హరీశ్ రావ్

minister harishrao on governor comments: వైద్యుల మనో దైర్యం దెబ్బతీసేలా గవర్నర్ మాట్లాడటం దురదృష్టకరమన్నారు. డాక్టర్ అయి ఉండి అలా మాట్లాడటం బాధాకరమని.. ఇది తగదని చెప్పారు. తెలంగాణలో వైద్యం బాగోలేదని ఎలా అంటారు..? అని ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ఆరోగ్య రంగం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు.కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని అనేక సార్లు వెల్లడించిందని గుర్తు చేశారు.ఒక వైపు కేంద్రం ప్రశంసలు కురిపిస్తే, మీరు విమర్శలు చేస్తారా అని నిలదీశారు. మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతుందని... ఏ బిజెపి పాలిత రాష్ట్రంలోనూ ఇంత పురోగతి లేదని తెలిపారు. దేశంలో ఆరోగ్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని చెప్పారు మంత్రి హరీశ్ రావు.

అక్కడ చూడండి…

'కేసీఆర్ కిట్, ఇతర చర్యల వల్ల 2014 లో 30 శాతం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 66 శాతం చేరాయి. హెల్త్ అండ్ వెల్నెస్ ర్యాంకింగ్లో తెలంగాణ నెంబర్వన్ స్థానంలో ఉంది.మలేరియా నివారణలో 2 నుండి కేటగిరీ 1 కి రాష్ట్రం అభివృద్ధి చెందింది అని కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం చేయడం వల్ల, ఆశాలు ఏఎన్ఎంలు మా వైద్యాధికారులు ఎంతో కృషి చేయడం వల్ల సాధ్యమైంది. ఇది గవర్నర్ గారికి ఎందుకు అర్థం కావడం లేదు.ఒక డాక్టర్ గా మీరు తెల్సుకుని మాట్లాడాలి. గవర్నర్ గారు.. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న బీబీనగర్ ఏయిమ్స్ ఆస్పత్రిని ఒక్కసారి వెళ్లి చూడండి. ఇదే సమయంలో మా తెలంగాణ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలు చూడండి. తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాల్లో 10 పైసలు కూడా ఏమ్స్ లో లేవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఎయిమ్స్ తయారైంది. పేషెంట్లు లేరు డెలివరీలు కావు. కనీస సౌకర్యాలు ఉండవు' అని మంత్రి విమర్శించారు.

IPL_Entry_Point

టాపిక్