Harish Rao : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర సిజేరియన్లు లేకుండా చూడాలి-minister harish rao review on health department ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Harish Rao : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర సిజేరియన్లు లేకుండా చూడాలి

Harish Rao : ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర సిజేరియన్లు లేకుండా చూడాలి

HT Telugu Desk HT Telugu
Jun 05, 2022 06:33 PM IST

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనవసర సిజేరియన్లు లేకుండా చూడాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేయాలని చెప్పారు.

మంత్రి హరీశ్ రావు
మంత్రి హరీశ్ రావు

వైద్యారోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యలో గణనీయంగా పురోగతి సాధించామని హరీశ్ రావు చెప్పారు. తెలంగాణలో 60 శాతం సిజేరియన్లు జరగడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులో అనవసర సిజేరియన్లు జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేవారిపై మెడికల్ కౌన్సిల్​కు ఫిర్యాదు చేయాలన్నారు.

సమీక్షలో భాగంగా.. పీహెచ్‌సీల ప‌నితీరు, పురోగతిపై అన్ని జిల్లాల వైద్యాధికారులతో హరీశ్ రావు మాట్లాడారు. ఎన్​సీడీ స్క్రీనింగ్, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీ- సెక్షన్ల రేటు, ఏఎన్​సీ రిజిస్ట్రేషన్, గర్భిణులకు అందుతున్న ఇతర సేవలు, ఓపీ, టీబీ, టీ-డయాగ్నోస్టిక్, ఐహెచ్ఐపీ లాంటి వైద్య సేవలపై జిల్లాలు, పీహెచ్​సీల వారీగా ఆరా తీశారు.

'క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు జిల్లా వైద్యాధికారులు నెలలో అన్ని పీహెచ్​సీలను సందర్శించాలి. నెలలో ఒక్కరోజైనా పీహెచ్​సీలలో నిద్ర చేయాలి. నేను కూడా స్వయంగా ఒకరోజు నిద్ర చేస్తాను. కేంద్రం విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం రాష్ట్రంలో శిశు మరణాల రేటు 23 నుంచి 21కి తగ్గింది. 2014తో పోలిస్తే ఎంఎంఆర్, ఎన్​ఎంఆర్, ఇనిస్టిట్యూషనల్ డెలివరీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్యలో ప్రగతి సాధించాం.' అని హరీశ్ రావు అన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్