TS Weather Updates: తెలంగాణలో ఎండలు యథాతథం..అక్కడక్కడ వానలు పడే ఛాన్స్
TS Weather Updates: తెలంగాణలో ఎండలు మండిపోనున్నాయి. ఎండలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
AP TS Weather Updates: తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనావేస్తోంది. శనివారం నుంచి రాష్ట్రంలో మూడ్రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిం చింది.
దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వానల ప్రభావం ఉంటుందని పేర్కొంది. నల్గొం డ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, నాగర్కర్నూల్, వనపర్తి, రంగా రెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడొచ్చని అంచనావేసింది.
వానలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని హెచ్చరించింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత రికా ర్డయింది. కరీంనగర్ జిల్లా తంగులలో 45.6, నల్గొండ జిల్లా దామరచర్లలో 45.5, కరీంనగర్ జిల్లా వీణవంక, సూర్యాపేట జిల్లా రాయినిగూడెంలో 45.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ మీదుగా తెలంగాణ వరకు ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ ప్రాంత జిల్లాల్లో రానున్న రెండ్రోజులు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
రెండ్రోజుల పాటు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గురువారం గరిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.0 డిగ్రీలు నమోదైంది. రాష్ట్రానికి వాయవ్య దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.