Nizamabad district : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం- కూతురు పెళ్లి రోజే ఘటన!-man tried to commits suicide due to family dispute in nizamabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nizamabad District : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం- కూతురు పెళ్లి రోజే ఘటన!

Nizamabad district : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం- కూతురు పెళ్లి రోజే ఘటన!

HT Telugu Desk HT Telugu
Dec 29, 2023 09:43 PM IST

Nizamabad district News: కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. అయితే కుమార్తె పెళ్లి రోజే ఈ ఘటన జరిగింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యయత్నం
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యయత్నం (Unsplash)

Nizamabad district News: కుటుంబ కలహాలతో కలత చెంది వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. తన కూతురి వివాహం తన ఇష్ట ప్రకారం చేయడం లేదని మనస్తాపంతో పోలీస్ స్టేషన్ సమీపంలో ఒంటి పై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన పోలీసులు ఆసుపత్రిలో చేర్పించడంతో ప్రమాదం తప్పింది. ఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

మోపాల్ మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన కోహిల్కర్ రాజు (45) డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కానీ గత మూడు సంవత్సరాల నుంచి భార్యతో గొడవలు కారణంగా ఇద్దరు దూరంగా ఉంటున్నారు. పైగా శుక్రవారం రోజు తన కూతురు పెళ్లి ఉండడం, తను దూరంగా ఉండడంతో మనస్థాపం చెందాడు. అతని కూతురు పెళ్లి అతని అంగీకారం లేకుండా చేస్తున్నారని కలత చెంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. స్థానిక పోలీస్ స్టేషన్ కి సమీపంలో డిజిల్ ఒంటి పై పోసుకొని ఆత్మహత్య పాల్పడ్డడు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది తక్షణమే స్పందించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. నలభై శాతం వరకూ శరీరం కాలిపోయిందని, ప్రాణాపాయనికి ఎటువంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు.

రిపోర్టింగ్ ః భాస్కర్, నిజామాబాద్ జిల్లా ప్రతినిధి

Whats_app_banner