KCR On Early Polls : ముందస్తుపై కేసీఆర్ క్లారిటీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు-kcr gives clarity on early elections in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr On Early Polls : ముందస్తుపై కేసీఆర్ క్లారిటీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు

KCR On Early Polls : ముందస్తుపై కేసీఆర్ క్లారిటీ.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు

HT Telugu Desk HT Telugu
Nov 15, 2022 06:06 PM IST

TRS Executive Meeting : తెలంగాణలో సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పెద్ద ఎత్తున చర్చ ఉంది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ వచ్చేసింది.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ (twitter)

తెలంగాణ భవన్(Telangana Bhavan)లో కేసీఆర్(KCR) అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులతో పలు కీలక అంశాలపై గులాబీ బాస్ చర్చించారు. టీఆర్ఎస్(TRS) నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికలపైనా కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు. షెడ్యూల్ ప్రకారమే.. తెలంగాణ శాసనసభ ఎన్నికలు(Telangana Assembly Elections) జరుగుతాయని చెప్పారు. ముందుస్తుకు వెళ్లే ఆలోచన లేదని అన్నారు.

'ఎన్నికలు సమీపించే కొద్ది బీజేపీ(BJP) రోజురోజు మరింతగా రెచ్చిపోతుంది. పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరమైన విషయాల జోలికి పోవద్దు. వివాదాస్పద విషయాల్లోకి తలదూర్చకూడదు. ఐటీ(IT), ఈడీ(ED), సీబీఐ దాడులకు భయపడాల్సిన పనిలేదు. ముందస్తు ఎన్నికల(Early Elections))కు వెళ్లేది లేదు. షెడ్యూల్ ప్రకారమే.. అసెంబ్లీ ఎన్నికలు(Assembly Polls) జరుగుతాయి.' అని కేసీఆర్ స్పష్టం చేశారు.

పార్టీని బలోపేతం చేసే దిశంగా 10 నెలలు కష్టపడాలని కేసీఆర్(KCR) చెప్పారు. ఇకపై ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోనే ఉండాలన్నారు. మంత్రులు తమ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా.. అంతటా తిరగాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రలోభాలకు ఎమ్మెల్యేలు(MLAs) లొంగొద్దని చెప్పారు. మునుగోడు ఫలితాల్లో(Munugode Result) గెలిచామని, కానీ మెజారిటీ తగ్గడంపై మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు(MLA Tickets) ఇవ్వనున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. మంత్రులు.. ఎమ్మెల్యేల గెలుపు బాధ్యత తీసుకోవాలని చెప్పారు. మూడోసారి కూడా టీఆర్ఎస్(TRS) అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అన్నారు.

Whats_app_banner