IRCTC Nashik Tour: హైదరాబాద్ టు నాసిక్... అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ-irctc tourism nashik tour from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Nashik Tour: హైదరాబాద్ టు నాసిక్... అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ

IRCTC Nashik Tour: హైదరాబాద్ టు నాసిక్... అతి తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 21, 2023 03:36 PM IST

IRCTC Hyd -Nashik Tour : హైదరాబాద్ నుంచి నాసిక్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. జులై 28వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది.

నాసిక్ టూర్
నాసిక్ టూర్

IRCTC Nashik Tour Pckage: నాసిక్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా…? మీకోసం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో భాగంగా పలు అధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. 'SAI SHIVAM' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రంలోని నాసిక్ మాత్రమే కాకుండా పాటు షిర్డీ సాయిని దర్శించుకోవచ్చు. 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జులై 28, 2023వ తేదీన అందుబాటులో ఉంది.

మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6:50 గంటలకు ట్రైన్ ఉంటుంది. రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. పికప్ చేసుకుని షిరిడీకి తీసుకెళ్తారు. ఆ తర్వాత హోటల్‌లో చెక్ ఇన్ అవ్వాలి. అనంతరం షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలో తిరగొచ్చు. రాత్రికి అక్కడే చేస్తారు.

మూడో రోజు షిరిడీలో హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళ్తారు. పంచవటి దర్శనం ఉంటుంది. నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 08:30 గంటలకు రైలు ఉంటుంది. 09:20 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

నాల్గొవ రోజు 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ధరల వివరాలు:

నాసిక్ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్ లో డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.6790 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యెపన్సీకి 5070, సింగిల్ ఆక్యూపెన్సీకి 12140 చెల్లించాలి.

ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్‌లోనే నలుగురి నుంచి ఆరుగురు ప్యాకేజీ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ ఆక్యెపెన్సీకి 4530గా ధర నిర్ణయించారు. టూర్ ప్యాకేజీ బుకింగ్ తో పాటు ఇతర వివరాలు https://www.irctctourism.com వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం